Breaking News

17/09/2019

315 అడుగుల లోతుల్లో...

రాజమండ్రి, సెప్టెంబర్ 17, (way2newstv.in)
గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజూ ముమ్మరంగా గాలింపు చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలిస్తున్నారు. కచ్చులూరు నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి నదిలో గాలిస్తున్నారు. బోటు జాడ కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. నీటిపై తేలుతున్న ఆయిల్ తెట్టు ఆధారంగా కచ్చులూరు సమీపంలో బోటు ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అంచనా వేసింది. బోటు ఉన్న ప్రాంతంలో 270 నుంచి 315 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేశారు. రాయల్ వశిష్ట టూరిస్టు బోటు జాడ కోసం ఉత్తరాఖండ్ కి చెందిన 30మంది సభ్యుల ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. 
315 అడుగుల లోతుల్లో...

వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. సోమవారం(సెప్టెంబర్ 16,2019) నాలుగు మృతదేహాలు లభించాయి. మిగతా వారికోసం ఎన్డీఆర్ఎఫం, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు గోదావరిని జల్లెడపడతున్నాయి. మరోవైపు... 315 అడుగుల లోతులో బోటును గుర్తించారు. దానికింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశముందని రెస్క్యూ టీమ్ చెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనలో గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా... గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 61 మంది ప్రయాణికులు, 10 సిబ్బందితో పాటు మొత్తం 71 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభించాయి. మరో 30 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ తెలిపింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో... సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గజ ఈతగాళ్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు 256 మందితో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే... నదిలో వరద ఉధృతి కారణంగా గాలింపు చర్యలు ఫలించట్లేదు. ఆయిల్‌ మరకల ఆధారంగా బోటు మునిగిపోయిన ప్రాంతాన్ని గుర్తించారు. 315 అడుగుల లోతులో బోటును గుర్తించారు. బోటు కింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశముందని గాలింపు బృందాలు చెబుతున్నాయి. గల్లంతైన వారిలో చాలా మంది లాంచీలో చిక్కుకుపోయి ఉండే అవకాశముందని ఎన్డీఆర్‌ఎఫ్ భావిస్తోంది. గల్లంతైనవారి ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6 ఫైర్‌ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శాటిలైట్‌ ఫోన్‌, 12 ఆస్కాలైట్లు, 8 బోట్లను ఉపయోగించి రెస్క్యూ నిర్వహిస్తున్నారు. రెండు ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలు, మూడు రాష్ట్ర బృందాలు పని చేస్తున్నాయి. ఇండియన్‌ నేవీ నుంచి ఒక డీప్‌ డైవర్స్‌ బృందం పని చేస్తోంది. రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్‌జీసీ ఛాపర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం జగన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాయల్ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ, 6 అగ్నిమాపక బృందాలు, స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment