Breaking News

12/08/2019

ఉచిత ఆఫర్లపైనే కేజ్రీ ఆశలు

న్యూఢిల్లీ, ఆగస్టు 12, (way2newstv.in)
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఉచిత ఆఫర్లు ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా? ఆఫర్లతో పాటు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తనను మరోసారి విజేతగా నిలుపుతాయని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఢిల్లీలో మరోసారి పాగా వేసేందుకు శతవిధాలా కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న అరవింద్ కేజ్రీవాల్ తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విక్టరీ కొట్టాలని విపరీతంగా శ్రమిస్తున్నారు.ఢిల్లీలో గత ఎన్నికల్లో 65 సీట్లు సాధించిన అరవింద్ కేజ్రీవాల్ తిరిగి అదే టార్గెట్ ను పెట్టుకున్నారు. ఒక వైపు ఉచిత హామీలను విపరీతగా ఇస్తూనే మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో చేజారి పోయిన వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. ఇటీవల 200 యూనిట్ల వరకూ ఉచితంగా, 400 యూనిట్లలోపు యాభైశాతం సబ్సిడీతో విద్యుత్తును అందించే పథాకన్ని కూడా లైన్లో పెట్టారు.
ఉచిత ఆఫర్లపైనే కేజ్రీ ఆశలు

దీంతో పాటుగా తాజాగా ఢిల్లీ వాసులకు ఉచిత వైఫై పథకాన్ని ప్రకటించారు. దేశ రాజధానిలో 11 వేల ఉచిత వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా వాడుకునేలా పథకాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు అరవింద్ కేజ్రీవాల్. గతంలోనే హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఈ పథకాన్ని త్వరగా పూర్తి చేసి ఓట్లు సంపాదించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్.మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కు గతంలో అండగా నిలబడిన ముస్లిం సామాజిక వర్గం లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పక్షాన నిలబడింది. దీంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు చతికలపడ్డాయి. ఈసారి జమ్మూకాశ్మీర్ విభజన అంశాన్ని కేజ్రీవాల్ సమర్థించినప్పటికీ, మోదీ పై వ్యతిరేకతతో ముస్లిం వర్గాలు తమవైపే నిలుస్తారన్న నమ్మకంతో కేజ్రీవాల్ ఉన్నారు. అంతేకాకుండా ఉచిత పథకాలతో కాంగ్రెస్ కూడా తనతో కలసి వస్తుందన్నది కేజ్రీవాల్ ఎత్తుగడ. మరి ఏంజరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment