Breaking News

12/08/2019

బీజేపీ ఇలా... కాంగ్రెస్ అలా

న్యూఢిల్లీ, ఆగస్టు 12, (way2newstv.in)
కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరాలా లేవు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ అంశాన్ని తీసుకుని మామూలు మైలేజీ సాధించలేదు. దీంతో కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ పార్టీలోని నేతలే బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సొంత పార్టీపై అసహనం ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న స్టాండ్ ను సొంత పార్టీ నేతలే స్వాగతించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్న నేతలు సయితం రాంగ్ డెసిషన్ అంటూ టెన్ జన్ పథ్ వైపు చూపుతున్నారు.అసలు లోక్ సభ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పరిస్థితి ఇంత దయనీయంగా లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకూ ఉండేది. ముఖ్యంగా పంజాబ్ లో విజయం సాధించడం, గుజరాత్ ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా హోరాహోరీ పోరాడటంతో రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. 
బీజేపీ ఇలా... కాంగ్రెస్ అలా

పార్టీలోనూ, బయటా రాహుల్ జపం మామూలుగా లేదు.ఆ తర్వాత కొంతకాలం క్రితం జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ , రాజస్థాన్ ఎన్నికల తర్వాత ఇక రాహుల్ గాంధీని పట్టలేకపోయారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో లోక్ సభ ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమా కాంగ్రెస్ లో కన్పించింది. మిత్రపక్షాల్లోనూ మోదీని ఓడించగల సత్తా రాహుల్ గాంధీకి ఉందని నమ్మారు. దీంతో మిత్రపక్స పార్టీలన్నీ కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు డిసైడ్ అయిపోయాయి. ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో పొత్తులతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయినా ఓటమి తప్పలేదు.అయితే తాజాగా రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండటంతో మిత్రపక్షాలు కూడా హస్తం పార్టీని దూరం పెట్టేస్తున్నాయి. కీలక బిల్లుల విషయంలో డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ మినహా పెద్దగా ఎవరూ కలసి రావడం లేదు. మాయావతి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. మమత బెనర్జీ పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా కలసి రావడం లేదు. ఆర్జేడీ మిత్రపక్షంగా ఉన్నా సైలెంట్ అయిపోయింది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందున్న ఊపు ఇప్పుడు కాంగ్రెస్ లో లేకపోవడంతో మిత్రపక్షాలు కూడా సైడయిపోతున్నాయనే చెప్పాలి.మూడు నెలల నుంచి నాధుడే లేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి నాధుడు లేకుండానే మూడు నెలల పుణ్య కాలం గడచిపోయింది. ఎపుడైతే ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చాయో అప్పుడే యువరాజు రాహుల్ గాంధి కాడి వదిలేశారు. నా కొద్దీ ప్రెసిడెంట్ గిరీ అంటూ కిరీటం పక్కన పెట్టేశాడు. నాటి నుంచి కాంగ్రెస్ లో మలుపులు అన్నీ ఇన్నీ కావు. టీవీ సీరియల్ మాదిరిగా, జీడిపాకంలా సాగుతోంది కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కధ. గతంలో కాంగ్రెస్ లో మేరు నగధీరులు ఉండేవారు. గాంధీ వారసులతో సరిసమానమైన సత్తా చూపించే దిగ్గజాలు ఎందరో ఉండేవారు. అందుకే సులువుగా అధ్యక్ష పదవికి సరైన నేతలు దొరికేవారు. తన నియంత్రుత్వపు పోకడలతో వారిని పోగొట్టుకున్న కాంగ్రెస్ కి ఇపుడు మిగిలింది అంగుష్టమాత్రులే. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇపుడు పిలిచి పీఠమెక్కిస్తామన్నా ఆ స్థాయి కలిగిన నాయకులు పార్టీలో కాగడా పెట్టి వెతికినా దొరికేట్టులేరు.ఇక కాంగ్రెస్ లో జీ హుజూర్ కల్చర్ కి అలవాటు పడిన ప్రాణాలే మొత్తానికి మొత్తంగా ఉన్నాయి. వారందరికీ గాంధీ కుటుంబం తప్పితే మరొకరిని అధ్యక్ష పీఠంపై చూసి సహించే ఓపిక, భరించే సహనం అసలే లేవు. తాము అంతా ఒక్కటి, గాంధీ కుటుంబం మాత్రమే దేశాన్ని, పార్టీని ఉద్ధరించేందుకు దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలను కాంగ్రెస్ నేతలకు అతి పెద్ద భ్రమలు ఉన్నాయి. ఇప్పటికిపుడు వాటిని తొలగించుకుని మేమూ నాయకులమే అని బోరవిడిచి నిలబడే సత్తా ఎవరికీ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అన్న వారే లేకుండా పోయారు. ఇపుడు ఈ విచిత్ర పరిస్థితే కాంగ్రెస్ కు లీడర్ అన్న వారు లేకుండా చేస్తోంది. రాహుల్ గాంధి వద్దు పొమ్మంటున్నా వర్కింగ్ కమిటీ 
తీర్మానల మీద తీర్మానాలు చేస్తూ శరణం అంటోంది. నిజంగా ప్రజాస్వామిక లక్షణాలు ఏవీ ఆ పార్టీకి లేవన్నది తాజా ఉదంతం చూస్తే అర్ధమవుతోంది.కొడుకు పార్టీని విడిచిపెడితే తల్లి సోనియమ్మే అధ్యక్షురాలు కావాలని కాంగ్రెస్ మొత్తం కోరుకుంటోంది. 2017 డిసెంబర్ లో ఆర్భాటంగా కాంగ్రెస్ కిరీటాన్ని స్వయంగా సోనియా రాహుల్ కు తొడిగారు. ఈనాడు పార్టీకి అధ్యక్షుడు, రేపు దేశానికి ప్రధాని అంటూ నాడు సోనియమ్మతో సహా అంతా ఆనందించిన సందర్భమది. ఆ మురిపాలు తీరకుండానే కాంగ్రెస్ పార్టీ పుట్టె ముంచుతూ రాహుల్ పదవిని కాలదన్నారు. మరో వైపు తన కుటుంబం నుంచి ఎవరూ పార్టీ బాధ్యతలు స్వీకరించరారదని షరతు కూడా పెట్టారు. ఎవరెన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వినేలా లేవు. రాహుల్ కాకపోతే సోనియమ్మ మా పెద్ద అంటున్నారు. ఆమెను అధ్యక్షురాలిగా చేసుకుంటామంటున్నారు. నిజమే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇపుడు దయనీయంగా ఉంది. సోనియా ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఇలా లేదు. రెండు సార్లు యూపీయేను ఆమె అధికారంలోకి తీసుకువచ్చారు. మిత్ర పక్షాలతో ఆమె కలసి కూటమిని కట్టారు. ఇపుడు ఆ చొరవ తెగువ రాహుల్ లో లేకపోవడం ఓ కారణమైతే సోనియా మీద ఉన్న నమ్మకం, గౌరవం కొడుకు మీద మిత్రులకు కూడా లేదు. అందువల్లనే కాంగ్రెస్ శ్రేణులు కూడా సోనియా అయితేనే ఈ సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కిస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. మరి సోనియాగాంధీ పార్టీని గట్టెక్కిస్తారా? లేదా? చూడాలి.

No comments:

Post a Comment