Breaking News

29/08/2019

డెంగ్యూ జరా భద్రం

హైద్రాబాద్, ఆగస్టు 29, (way2newstv.in
ఈ సీజన్‌లో జ్వరం వచ్చిందంటే చాలు ప్రజలు హడలిపోతున్నారు. మామూలు జ్వరాలైతే ఏమి ఫరవాలేదు కాని. డెంగ్యూ, చికెగ్‌గున్యా లాంటి జ్వరాలు సోకితే తగ్గేవరకు ఇబ్బందులు తప్పవు. వర్షా కాలంలో జ్వరాలు సోకుతాయి. దోమలు, కలుషిత నీటివల్ల జ్వరాలు సోకుతాయి. అయితే అందరిని కలవరపరిచేది డెంగ్యూ జ్వరం. ఇది ఎక్కువగా వర్షాకాలం సోకుతుంది. ఇది ఏడిస్ అనే దోమకాటు వల్ల వస్తుంది. దీనిని టైగర్ దోమ అని కూడా అంటారు. డెంగ్యూ జ్వరం మామూలు జ్వరం కంటే అధికంగా ఉండి శరీరంలో రక్తం, కండరాలు, మెదడు, గుండె, రక్తంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జ్వరం సోకితే ముఖ్యంగా మూడు నాలుగు రోజులు జ్వరం తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతునారు.
డెంగ్యూ జరా భద్రం

* తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
* బిపి తగ్గిపోతుంది. అలాగే శరీరం కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి.
* ఇంకా తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయి.
* వాంతులు, విరేచనాలు, చర్మంపై దురద ఏర్పడుతుంది.
* డెంగ్యూ జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే నిర్లక్షం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
* డెంగ్యూ శరీరంలో ముఖ్యంగా రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను బాగా తగ్గిపోతాయి.
* దీంతో మనిషికి నిస్సత్తువ ఏర్పడి కుంగుబాటుకు గురిచేస్తుంది. మరింత ఎక్కువగా ప్లెటెలెట్స్ తగ్గుతూ పోయి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
* గుండె రక్త నాళాలకు సరిగా రక్త ప్రసరణ తగ్గిపోతుంది.
* కిడ్నీ పని తీరుపై కూడా ప్రభావం చూపుతుంది.
* రక్తంలో ప్లెట్‌లేట్లు తగ్గిపోతాయి.
ఈ జ్వరం నుంచి త్వరగా కోలుకునేందుకు నిర్లక్షం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. వైదుల సూచనలను పాటించాలి. శరీరం సత్తువకోసం పళ్ల రసాలు, కొబ్బరి నీరు తరచుగా తీసుకోవాలి.
మల కాటు నివారణ : ముఖ్యంగా ఇళ్లల్లో దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* రాత్రి పడుకున్నపుడు దోమ తెరలు కట్టాలి.
* దోమల నివారణ మందులు వాడాలి. బయటి నుంచి దోమలు లోనికి రాకుండా దోమ తెరలు అమర్చాలి.
రాత్రి పడుకున్నపుడు పిల్లలకు నిండుగా దుస్తులు తొడగాలి.
* చేతులకు, కాళ్లకు దోమలు కుట్టకుండా దుస్తులు ధరించాలి. కాళ్లకు సాక్సులు కూడా వేసుకోవాలి. సాయ్రంతం ఇళ్ల లోపలికి దోమలు రాకుండా డోర్లు వేసి ఉంచాలి.
* కిటికీలు, డోర్లకు దోమ తెరలు కట్టాలి. ముఖ్యంగా ఇళ్ల పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు నిలువ ఉంటే దోమలు పెరుగుతాయి.
* అందువల్ల దోమలు పెరగకుండా చూడడం ముఖ్యం.

No comments:

Post a Comment