Breaking News

29/08/2019

కోకాపేటలో 22 కోట్లకు చేరిన ఎకరం..

హైద్రాబాద్, ఆగస్టు 29, (way2newstv.in)
హైద్రాబాద్ నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట్‌లో మరోమారు భూముల వేలానికి హెచ్‌ఎండిఎ సన్నాహాలు చేస్తున్నది. ప్రయోగాత్మకంగా సుమారు 146 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ అన్ని ఏర్పా ట్లు పూర్తిచేస్తున్నది. కనీసంగా 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒక ప్లాటుగా మొత్తం 30 నుంచి 40 ప్లాట్లతో లేఅవుట్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్ది ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలని అథారిటీ భావిస్తున్నది. ఈ భూములను విక్రయించ డం ద్వారా రూ. 3000 కోట్లు అర్జి ంచాలనే దృఢ విశ్వాసంతో ఉన్న ట్టు తెలిసింది. ఈ పాటికే డిజిటల్ సర్వే, ప్లాన్‌ల తయారు చేయడం వంటివి పూర్తిచేయడం, మౌలి క వసతులపై ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. 
కోకాపేటలో 22 కోట్లకు చేరిన ఎకరం..

ఈ లేఅవుట్‌లో అత్యంత భారీ బహుళ అంతస్థులతో కూడిన భవనాల నిర్మాణానికి వీలుగా లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. విశ్వనగరానికి ఐకాన్ టౌన్‌షిప్‌ను ఏర్పాటుకు ప్రయోగాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది.కోకాపేట్‌లో అథారిటీ చేసే లేఅవుట్‌లో ప్లాటును కనీసంగా ఎకరంకు సుమారు రూ. 22 కోట్లు ఆపైన ధరలకే విక్రయించాలనే యోచన చేస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ ధరతో ప్లాట్లుగా చేసిన 146 ఎకరాలను విక్రయించడం ద్వారా కనీసంగా రూ. 3000 కోట్లు రావచ్చని భావిస్తున్నారు. గత 2000 నుంచి 2006 మధ్య కాలంలో హెచ్‌ఎండిఎ 166 ఎకరాల భూములను వేలంలో విక్రయించిన విషయం విదితమే. కోకాపేట్‌లో అథారిటీకి మొత్తం 623 ఎకరాలు ప్ర భుత్వం ద్వారా చేకూరిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల అ థారిటీ నుంచి కొనుగోలు చేసిన వారు కూడా తమతమ భూములను క నీసంగా రూ. 25 కోట్లకు ఎకరం భూమిని విక్రయించిన ప్రచారంలో ఉ న్నది. దీనిని పరిగణలోకి తీసుకున్నదేమో అక్కడ భూములను వేలం వే సేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కార్యాలయవర్గాల్లో చర్చకు తెరలేచింది.ప్రస్తుతం హెచ్‌ఎండిఎ వద్ద భారీ పథకాలు ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఏర్పాటు చేయనున్న మెట్రోరైలు పథకానికి సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. కొత్వాల్‌గూడలో కనీసంగా రూ. 250 కోట్లు మేర వ్యయం చేసే “నైట్ సఫారి” ఏర్పాటు, గండిపేట జలాశయం సుందరీకరణ, మల్టీలేవల్ పార్కింగ్ భవనం, మూసాపేట్ టిఓడి, తెల్లాపూర్ టెక్నోసిటీ, మహేశ్వరం వద్ద డిస్కవరీ సిటీ, ప్యారడైజ్ నుంచి కొంపల్లి వరకు ఫ్లైఓవర్, జెబిఎస్ నుంచి తూంకుంట వరకు ఆకాశ వంతెన, శంషాబాద్ విమానాశ్రయానికి మామిడిపల్లి ప్రాంతం నుంచి అనుసంధానంగా రోడ్డు, హైదరాబాద్ హ్యాబిటాట్ సెంటర్, ఎంఐసిఇ వంటి పథకాలు ఉన్నాయి.

No comments:

Post a Comment