Breaking News

08/08/2019

పల్లం రాజుకు ఏపీసీసీ పదవి

కాకినాడ, ఆగస్టు 8, (way2newstv.in
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభజనకు ముందు తరువాత భిన్నంగా మారిపోయాయి. దేశ రాజకీయ మేధావులు ఏపీ పాలిటిక్స్ అంటే కమ్మ, రెడ్ల పవర్ పాలిటిక్స్ గా నిర్వచనం దశాబ్దాల క్రితం నిర్వచించారు. తెలంగాణ విడిపోక ముందు వరకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే నడిచాయి కూడా. ఇక విభజన అనంతరం కూడా ఏపీ లో కమ్మ , రెడ్ల పాలనలే సాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన బలమైన సామాజిక వర్గం ఓటుబ్యాంక్ అండతోనే ముందుకు వచ్చారన్నది తెలిసిందే. తమ సెలబ్రిటీ స్టేటస్ కి సొంత సామాజికవర్గం తో అన్ని వర్గాలను కలుపుకుని అధికారం హస్తగతం చేసుకోవాలని రంగంలోకి దిగారు. 
పల్లం రాజుకు ఏపీసీసీ పదవి

అయితే చిరంజీవి ఈ ప్రయత్నంలో విఫలమై కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తే పవన్ తాను పాతికేళ్ళు పోరాడతా పోయిందేమి లేదంటున్న వైఖరితో సాగుతున్నారు.చిరంజీవి ప్రజారాజ్యాన్ని పార్టీలో విలీనం చేసుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని వైఎస్సాఆర్ చనిపోకముందు అధిష్టానం చెవిన వేశారు. అయితే ఆయన మరణం తరువాత సోనియా వైఎస్ మాటనే పాటించారు. ఇది ఒకరకంగా జగన్ తొందరగా వైసిపి పార్టీని ప్రకటించి కాంగ్రెస్ ను వీడడానికి కారణం అయిందంటారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ లో ఉంటే తండ్రిలాగే దశాబ్దాలపాటు వేచి చుడాలిసివుంటుందేమో అన్న అనుమానంతో పాటు 2014 లో చిరంజీవి ని సిఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంటుందన్న అనుమానం వీటికి తోడు ఓదార్పు వంటి యాత్రకు అధిష్టానం అనుమతి నిరాకరణ వైఎస్ జగన్ లో అభద్రత పెరిగి హస్తం పార్టీ ని వీడడానికి ప్రధాన కారణాలన్న ప్రచారం వుంది.అయితే వైఎస్ జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ ను వీడారో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ ను వీడి ఆయన వెంట నడిచింది. దాంతో బాటు వైఎస్ ఇమేజ్ కారణంగా మైనారిటీలు, ఎస్సి, ఎస్టీ, క్రైస్తవ సామాజికవర్గాలు జగన్ కి జై కొట్టేసి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కి చిల్లు పడేలా చేశాయి. విభజన వివాదాల్లో ఇక కాపు కార్డు ను పక్కన పెట్టి రఘువీరారెడ్డిని ఎపి పిసిసి అధ్యక్షుడిని చేసి యుద్ధానికి వెళ్లినా ఫలితం లేకపోయింది. తాజాగా జరిగిన 2019 ఎన్నికల్లో కూడా రఘువీరా రెడ్డి నాయకత్వంలో మరోసారి చతికిలపడింది కాంగ్రెస్.  తిరిగి తాము గతంలో అనుకున్న ఫార్ములాను పైకి తీసి అమల్లో పెట్టింది హస్తంపార్టీ.నెహ్రు కాలం నుంచి తమ కుటుంబానికి వీరవిధేయులైన మంగిపూడి కుటుంబ వారసుడు పల్లంరాజు కి ముళ్ళకీరిటం పెట్టింది కాంగ్రెస్. ఎపి లో కాపు సామాజికవర్గం కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పవర్ పాలిటిక్స్ లో వన్ టూ లుగా వుంటూ వస్తున్న వారికి చెక్ పెట్టాలని ఇప్పటికే బిజెపి కన్నా లక్ష్మి నారాయణను ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మరోపక్క జనసేన కు అదే సామాజికవర్గం నుంచి పవన్ కళ్యాణ్ అధినేతగా వున్నారు. ఇక కాంగ్రెస్ సైతం గతంలో తమకు సంప్రదాయ ఓటు బ్యాంక్ గా వున్న కాపులకు అండగా ఉన్నామనే సంకేతాలను పల్లంరాజు ద్వారా పంపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. మొదటి నుంచి కాంగ్రెస్ కి అండగా వున్న రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గించుకుని ఎస్సి ఎస్టీ సామాజికవర్గాల నేతలకు బాధ్యతలు ఇచ్చి సరికొత్త ప్రయోగం చేయాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఎపి విభజన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చేశారని భూమిలో పాతిపెట్టేశారు ప్రజలు. దీనికి తోడు విభజల సమస్యలు, ఆదాయం లేని ఎపి గుర్తొచ్చినంతకాలం కాంగ్రెస్ కి కష్టకాలమే నడిచే పరిస్థితి వుంది. మరి క్యాస్ట్ కార్డు తో, ఏపీకి మేమె హోదా ఇస్తామంటూ రీ ఎంట్రీకి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ను మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు ఒడ్డునపడేయలేరు కానీ పార్టీ పరిస్థితిని కొంతైనా మెరుగు పరుస్తారో లేదో చూడాలి.

No comments:

Post a Comment