Breaking News

17/08/2019

లంచాల్లో రెవెన్యూ రికార్డ్

హైద్రాబాద్, ఆగస్టు 17(way2newstv.in)
ఎసిబికి పట్టుబడిన వారిలో రెవెన్యూశాఖకు చెందిన ఉద్యోగులు అత్యధికులున్న ట్లు ఎసిబి రికార్డులు వెల్లడిస్తున్నాయి. గ డచిన కొద్ది నెలలలో రెవెన్యూ శాఖ సిబ్బందిపై దాదాపు 40 ఎసిబి కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎసిబి అధికారుల కు పట్టుబడిన వారిలో విఆర్‌ఒ స్థాయి వా రే ఉండటం గమనార్హం. ఇటీవల ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఇద్దరు విఆర్‌ఒలు ఒకే రోజు పట్టుబడ్డారు. రామగుండం మండల తహసీల్దారు కార్యాలయంలో విఆర్‌ఒగా విధులు నిర్వహిస్తున్న జగన్నాథ మల్లేషం తనపేరు, తండ్రిపేరు మార్చేందుకు లంచం డిమాండ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అలాగే ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల విఆర్‌ఒ రాథోడ్ సుశీల పట్టా పాస్‌పుస్తకం బదలాయించే విషయంలో లంచం డిమా ండ్ చేసింది. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిం ది. 
లంచాల్లో రెవెన్యూ రికార్డ్

అలాగే వరంగల్ ఆర్బన్ జిల్లా భీందేవరపల్లి మందలం వంగర గ్రామ విఆర్‌ఓ గుమ్మడి రమేష్ రూ.5వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.వంగర గ్రామ పరిధిలోని రంగయ్యపల్లికి చెందిన బి.రవి పట్టాదారు పాసు పుస్తకం కోసం విఆర్‌ఒ రమేష్‌ను సంప్రదించాడు. అయితే పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలంటే తనకు రూ.5వేల ఇవ్వాలని విఆర్‌ఓ డిమాండ్ చేశాడు. దీంతో రవి ఎసిబి అధికారులకు ఆశ్రయించాడు. ఈ నేపథ్య ంలో ఎసిబి అధికారులు ఎంఆర్‌ఓ కార్యాలయంలో రవి నుంచి లంచం తీసుకుంటున్న విఆర్‌ఒ రమేష్ ను రెడ్‌హ్యాండెండ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఓ భవన యజమాని నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ పుప్పాలగూడ గ్రామ పంచాయతీ సెక్రటరి జె.వెంకటశివయ్య, ఎంపిటిసి శివప్రసాద్ వర్మలతోపాటు మధ్య వర్తి సయ్యద్ అర్షద్‌లను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.రూ. 2 లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. హుమాయున్‌నగర్ వాసి మెహదీ అలీఖాన్ పుప్పాలగూడ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్నాడు. ఈక్రమంలో భవన నిర్మాణ ం పూర్తి కావాలన్నా, కూల్చివేయకుండా ఉండేందుకు రూ. 2 లక్షలుకావాలని మధ్య వర్తి సయ్యద్ అర్షద్ ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరి జె.వెంకటశివయ్య, ఎంపిటిసి శివప్రసాద్ వర్మ డిమాండ్ చేశారు. భవన యజమాని ఆలీఖాన్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పివి నర్సింహరావు తెలంగాణ యూనివర్సిటీ సమీపంలో నగదు తీసుకుంటుండగా పుప్పాలగూడ గ్రామ పంచాయతీ సెక్రటరి జె.వెంకటశివయ్య, ఎంపిటిసి శివప్రసాద్ వర్మలతోపాటు మధ్య వర్తి సయ్యద్ అర్షద్‌లను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం విదితమే. వరంగల్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ సిసి తాజుద్దీన్ రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు కాపుకాసి పట్టుకున్న విషయం తెలిసిందే. 162 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసిన విషయంలో కోర్టు ఆ బియ్యాన్ని రిలీజ్ చేయాలని ఆదేశించిన సదరు సిసి తాజుద్దీన్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అనీల్ ఎసిబి అధికారులను ఆశ్రయించంతో సిసి అవినీతి వెలుగుచూసింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ శాఖల్లో అవినీతి తిమింగళాలపై ఎసిబి అధికారులు దూకుడు పెంచారు. ఎసిబి ఉన్నతాధికారులు అక్రమార్జనకు అర్రులు చాస్తున్న అవినీతి పరులను ఏరివేస్తుడటంతో బాధితుల్లో భరో సా కల్పిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన లంచావతారులపై ఇకపై రెండు కేసులు నమోదు చేయనున్నారు. లంచం తీసుకున్నందుకు ఒక కేసు,ఆపై అక్రమాస్తులు కూడబెట్టినందుకు (ఆదాయానికి మించి) మరో కేసు నమోదు చేయనున్నట్లు ఎసిబి అధికారులు వివరిస్తున్నారు.ఇటీవల కొందుర్గు విఆర్‌ఒ అంతయ్య రైతు నుంచి రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడగా ఎంఆర్‌ఒ లావణ్యపై రెండు కేసులు నమోదు చేశారు. ఎంఆర్‌ఒ లావణ్య ఆదేశాల మేరకే అనంతయ్య లంచం తీసుకుంటున్నట్టు ఎసిబి విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టగా రూ.93లక్షల నగదు, 40తులాలకు పైగా బంగారం లభ్యమైంది. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు తేలడంతో ఎంఆర్‌ఒ లావణ్య, విఆర్‌ఒలపై అవినీతి, అక్రమాస్తుల కేసులు నమోదు చేశారు. 

No comments:

Post a Comment