Breaking News

13/08/2019

కోటంరెడ్డి ఆరెస్టును ఖండించిన సోమిరెడ్డి

నెల్లూరు, ఆగష్టు 13 (way2newstv.in
నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో టీడీపీ నేత ఇల్లు కూల్చివేతను అడ్డుకున్న నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అరెస్టును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. వెంకటేశ్వరపురంలోని సర్వే నంబర్ 2209లో 57 ఇళ్లు ఉండగా టీడీపీ మాజీ కార్పొరేటర్ సల్మా జహీర్ నివాసాన్నే కక్షకట్టి కూల్చేయడం అన్యాయం. కూల్చడాలే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోందని అయన ఆరోపించారు. 
కోటంరెడ్డి ఆరెస్టును ఖండించిన సోమిరెడ్డి

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం వైకాపా దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండటం దురదృష్టకరం. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా ఆలోచించుకోవాలి..వైకాపా నేతల పాపాల్లో భాగం కావద్దని అయన అన్నారు. వైకాపాకు భారీ మెజార్టీతో అధికారం ఇచ్చిన ప్రజలకు ప్రతిఫలంగా వారిపైనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా వైకాపా పాలకులు పద్ధతి మార్చుకోవాలి. కక్షసాధింపులు, కూల్చడాలు..దాడులు మాని నిండుమనస్సుతో ప్రజారంజకంగా పాలన సాగించండని అయన అన్నారు.

No comments:

Post a Comment