Breaking News

16/08/2019

శిథిలావస్థలో హరిజన పాఠశాల......

బేస్మెంట్లో పగుళ్లు.. ఊడిన పైకప్పు........... 
విరిగిన కిటికీలు ,తలుపులు....... 
దయనీయ పరిస్థితుల్లో పాఠశాల...
వనపర్తి ఆగష్టు 16 (way2newstv.in)
మండల కేంద్రమైన గోపాల్ పేట లోని హరిజన్ వాడ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులను, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాలలో  71 విద్యార్థులకు గాను ముగ్గురు టీచర్లు కూడా ఉన్నారు. కాగా పాఠశాల ఎటు పరిశీలించిన కూడా బేస్ మెట్ల పగుళ్ళు, భవనం పైకప్పు ఊడి కింద పడడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ పాఠశాల భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 
శిథిలావస్థలో హరిజన పాఠశాల......

దీంతో విద్యార్థులను ఒకే గదిలో ఉంచి విద్యాబోధన చేయడం గమనార్హం. ఈ పాఠశాల భవనం బేస్ మెట్ల పగుళ్లు, భవనం పై కప్పు ఓడిన ది  ఒకెత్తయితే పాఠశాలకు అమర్చిన కిటికీలు తలుపుల పగుళ్ళు మరొకటి అయింది. ఇలా పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ ప్రాంతం వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరక్షరాస్యతను రూపుమాపడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్నో రకాల పాఠశాలలను నిర్మించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతుంటే గోపాల్ పేట హరిజనవాడ థమిక పాఠశాల ఎటువంటి అభివృద్ధికి నోచుకోక పోవడం విచారకరంగా ఉందని ఆ ప్రాంతం వారు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల పూర్తి దయనీయ పరిస్థితుల్లో ఉండి తీవ్ర ఆందోళన చెంది స్తుంది. ఈ విషయంపై పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ దేవన్న ను వివరణ కోరగా పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, విద్యార్థులను అందులో ఉంచకుండా ప్రక్కనే ఉన్న చిన్న గదిలో ఉంచి విద్యా బోధన చేస్తున్నారని ఆయన వివరించారు. అధికారులు ఈ పాఠశాల పై దృష్టి సారించి పాఠశాల భవన నిర్మాణానికి మరియు భవనం చుట్టుముట్టు ప్రహరీ గోడ నిర్మించి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment