Breaking News

16/08/2019

గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్, శాసనసభ్యుడు

జోగులాంబ గద్వాల ఆగష్టు 16 (way2newstv.in)
కె.ఎల్.ఏ.క్యాంప్ లో జోగులాంబ గద్వాల జిల్లా గ్రంధాలయ భవనాన్ని శుక్రవారం గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ  చైర్మన్ .బి.యస్.కేశవ్ ఆద్యక్షత వహించారు.   ఎమ్మెల్యే మాట్లాడుతూ    గద్వాల పట్టణంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే  ఈ గ్రంధాలయానికి వచ్చె  విద్యార్థి విద్యార్థినులకు చదువుకొనుటకు పుస్తకాలను తెలంగాణ ప్రభుత్వం నుండి,  నా వంతు సహాయ సహకారాలు అందింస్తానని అన్నారు. గ్రంధాలయ అభివృద్దికి   అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలంగాణ ప్రభుత్వం నుండి వెలువడే నోటిఫికేషన్లకు సంబంధించిన మెటీరియల్ కూడా అందుబాటు ఉండేటట్లుగా చేస్తానని అన్నారు. 
గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్, శాసనసభ్యుడు 

రాత్రి పూట చదువుకొనుటకు వచ్చే ప్రజలకు ఇతర సౌకర్యాలు టీ, టిఫిన్ వంటి ఉండేటట్లుగా నా వంతు కృషి చేస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  నేటి సమాజంలో  ప్రతి ఒక్కరూ చదువుకోవాలి.  లోకజ్ఞానం కోసం దిన పత్రికలు చదవాలి. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవాలి.  ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రతి ఒక్కరు, దాతల రూపంలో  గ్రంథాలయంలో అన్ని పుస్తకాల ఏర్పాటు కొరకు సహకరించాలని తెలిపారు  తరువాత రం ఆలయ ఆవరణ ప్రాంగణం లో హరితహారం లో భాగంగా ఎమ్మెల్యే  గారు జిల్లా కలెక్టర్,జిల్లా గ్రంథాలయ చైర్మన్  మొక్కలు నాటారు.    ఈ కార్యక్రమం లో ఆయన వెంట  వెంట జిల్లా రైతు సమన్వయం సమితి అధ్యక్షుడు చెన్నయ్య,    గద్వాల యం.పీ.పీ.ప్రతాప్ గౌడ్,  గట్టు యం.పీ.పీ విజయ్,  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్,  మాజీ యం.పీ.పీ సుభాన్   గద్వాల మండలం అధ్యక్షుడు రమేష్ నాయుడు,  మాజీ కౌన్సిలర్  మహిమూద్ అన్వార్,   తెరాస పార్టీ నాయకులు సలాం, మురళి,  కోటేష్,  గోవిందు క్రాంతి, మధు వంశీ, గ్రంథాలయం సెక్రెటరీ, సిబ్బంది నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment