Breaking News

08/08/2019

ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర: మంత్రులు

హైదరాబాద్ ఆగష్టు 8  (way2newstv.in):
సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొపుల ఈశ్వర్ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8న తేదీ వరకు మేడారం జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. 
ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర: మంత్రులు

ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా మేడారం జాతరను నిర్వహిస్తామన్నారు. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రితో పాటు అన్ని రాష్ర్టాల గిరిజన సంక్షేమశాఖల మంత్రులను అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గిరిజన సంఘాల ప్రతినిధులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మేడారం జాతర నిర్వహణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు కల్పించేవిధంగా చర్యలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. తొలివిడతలో రూ.10 కోట్లతో గద్దెల పరిసరాల్లో భూసేకరణ జరపాలని నిర్ణయించినట్లు మంత్రులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment