Breaking News

08/08/2019

జగన్ కోసం మొక్కు చెల్లించిన కొడాలి నాని

వరంగల్, ఆగస్టు 8 (way2newstv.in):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోసం తన మొక్కు చెల్లించుకున్నారు మంత్రి కొడాలి నాని. తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించి.. స్వామివారిని దర్శించుకున్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న తన కల నెరవేరిందని.. అందుకే ఇప్పుడు మొక్కు చెల్లించుకున్నానని నాని చెప్పారు. జగన్‌కు, ఏపీ ప్రజలకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షం టీడీపీ అనవసరం రాద్దాంతం చేస్తోందన్నారు నాని. సర్కార్‌కు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని.. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు.
జగన్ కోసం మొక్కు చెల్లించిన  కొడాలి నాని

గ్రామ వాలంటీర్ల విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని.. చంద్రబాబు పనీపాటా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నదులన్నీ పూర్తిస్థాయిలో నిండాయన్నారు నాని. జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సెప్టెంబర్1 నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి. రాష్ట్రంలో నాణ్యమైన రేషన్ సరుకులను ప్రజలకు అందిస్తామని.. ప్రభుత్వం రూ.11,000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. బ్యాగుల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. రేషన్ సరుకులను నేరుగా ప్రజలకు చేరవేసేందుకు బ్యాగులు వాడుతున్నామన్నారు. ప్రతిపక్షం ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

No comments:

Post a Comment