Breaking News

06/07/2019

బాక్సాఫీసు ముందు ఓబేబి రికార్డ్


హైద్రాబాద్, జూలై 6 (way2newstv.in): 
‘ఓ బేబీ’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సమంత. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లలతో నడుస్తోంది. సమంత కెరియర్‌లో సోలోగా అత్యధిక థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ ఆమె కెరియర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా ఓ బేబీ రికార్డ్ నెలకొల్పింది. యూఎస్‌లో గురువారం (జూలై 04) 93 లొకేషన్స్‌లో విడుదలైన ఈ మూవీకి ప్రీమియర్‌ ద్వారా 1, 45, 637 డాలర్లను వసూలు చేసింది. తెలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఇన్ని కలెక్షన్లు రావడంత ఇదే తొలిసారి.

 బాక్సాఫీసు ముందు ఓబేబి రికార్డ్ 

ఇక ఫ్రైడే నాడు ఈ కలెక్షన్లు రెట్టింపయినట్టు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా.. తొలిరోజు దాదాపు కోటి షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఉత్తరాంధ్రలో 21 లక్షలు, వెస్ట్ గోదావరి 6.8 లక్షలు, ఈస్ట్‌లో 8. 5 లక్షలు, క్రిష్ణా, గుంటూరులో 17 లక్షలు, నెల్లూరు 3.5 లక్షలు, సీడెడ్‌లో 12 లక్షలు, నైజాం ఏరియాలో 44 లక్షలు వసూలైంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ‘అలా మొదలైంది’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో సమంత 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకుంది. ఇప్పటికే నటిగా తనను తాను నిరూపించుకున్న సమంత ఈ సినిమాతో తనలోకి కొత్త నటిని ‘బేబీ’ పాత్ర ద్వారా పరిచయం చేశారు. ‘బేబీ’ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ‘బేబీ’ సమంత. ఇక వీకెండ్ కలిసి రావడంతో పాటు థియేటర్స్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బాక్సాఫీస్ బేబీ దున్నేయడం ఖాయంగానే కనిపిస్తోంది. 

No comments:

Post a Comment