Breaking News

09/07/2019

చంద్రబాబు అబద్దాలతో ప్రజలు విసిగిపోయారు

విజయవాడ  జూలై 9, (way2newstv.in)
టిడిపి ప్రభుత్వం 2.50 లక్షల కోట్లకు పైగా అప్పుల్ని చేసింది. నాన్ బడ్జెట్ పేరుతో వేల కోట్లు అప్పు చేశారు.చంద్రబాబు రాష్ర్టాన్ని అప్పుల పాలు చేశారు. చౌకగా వచ్చే విద్యుత్ ను కొనకుండా వారికి తాబేదార్లైన విద్యుత్ సంస్దలకు దోచిపెట్టారని సంతనూతలపాడు ఎంఎల్ ఏ  టిజేఆర్ సుధాకరబాబు ఆరోపించారు. మంగళవారం అయనమీడియాతో మాట్లాడారు. 48 వేల కోట్లు విద్యుత్ సంస్దలకు చెల్లించాల్సిన బకాయి ఉంది అవి ఎందుకు  చెల్లించలేదు. ఖరీఫ్ సీజన్ కు సనన్నధ్దంగా విత్తన సంస్దలకు బకాయిలు చెల్లించలేదు. విత్తనాల కొరత ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాం. విత్తనాల కొరత గురించి విద్యుత్ కోతల గురించి మాట్లాడారు. ఈ పాటికే విత్తనాలు వచ్చిఉండాలి. 
చంద్రబాబు అబద్దాలతో ప్రజలు విసిగిపోయారు

ఈ అంశాలలో అబద్దాలు వినివిని ప్రజలు విసిగిపోయారు. అవినీతి కోరల్లో చిక్కుకుని ఏపి ప్రజలు అల్లాడి పోయారని అన్నారు. జన్మభూమి కమిటీలపేరుతో నల్లతాచు, కట్లపాముల్లా గ్రామాల్లో తిష్టవేసుకుని కూర్చున్నాయి. పచ్చపసికర్లపాము ఇంకా ఉంది అది  175 పాములు బయటకు వస్తే 151 పాముల్ని చంపేశారు.23 తప్పించుకున్నాయి.లోకల్ బాడి ఎన్నికలలో వాటి సంగతి చూస్తారు. ఎన్నికల్లో పాముల్ని ప్రజలు చితక్కొట్టారు. 25 రకాల పాములు ఢిల్లీకి వెళ్లాలని బయటకు వచ్చాయి.వాటిలో 22 పాముల్ని చంపేశారు. ఇది జనం చేసిన సర్పయాగం.  వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నలభైరోజులు కాకుండానే చంద్రబాబు 400 అబద్దాలు ప్రచారంలోకి తెచ్చాడు. చంద్రబాబు కుమారుడు లోకేష్ నాలుగు తెలుగుపదాలు తప్పులేకుండా  మాట్లాడగలరాఅని ప్రశ్నించారు. నీతి కలిగిన నేత కాబట్టి ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తప్పులను కడగడంకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తిరస్కరించినా టీడీపీ అధినేత చంద్రబాబు , తనయుడు లోకేష్ కి ఇంకా సిగ్గురాలేదు. సీఎం జగన్ పైనా, ఎంపీ విజయసాయిరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారగలడు. నీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలకు వారసుడిగా లోకేష్ వచ్చాడని విమర్శించారు. ఇప్పుడు విద్యుత్ , విత్తనాల కొరతలకి కారణం చంద్రబాబు ప్రభుత్వమే. కానీ ఏ తప్పు చెయ్యని వ్యక్తిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏ తప్పు చెయ్యని వారైతే ఎందుకు విత్తనాల కొరతపై చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి విత్తనాలు, విద్యుత్ కొరతపై చంద్రబాబు మాట్లాడాలి. ఇప్పటికే నవరత్నాల హామీల అమలుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వంలోని పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ పేపర్ మిల్లులు పెడ్తామని అవినీతికి పాల్పడ్డారు. వాటిని ఈ అసెంబ్లీ సమావేశాలలో బయటపెడ్తాం.  వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని అయన అన్నారు. 

No comments:

Post a Comment