Breaking News

29/07/2019

హైదరాబాద్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ జూలై 29  (way2newstv.in - Swamy Naidu
చిక్కడపల్లి పీఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. దోమల్గూడలో ఫైనాన్స్ వ్యాపారి గజేంద్ర కిడ్నాప్నకు గురయ్యారు. రూ.3కోట్లు ఇవ్వాలని తనని కిడ్నాపర్లు బెదిరించారని, రూ.కోటి ఇవ్వడంతో అబిడ్స్లో విడిచిపెట్టారని గజేంద్ర చెబుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కార్లకు ప్రైవేటు లోన్లు ఇస్తూ గజేంద్ర ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. కానీ పోలీసుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. గజేంద్రే మోసగాడు అని పోలీసులు చెబుతున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం  రాత్రి ఏవీ కాలేజ్ దగ్గర గజేంద్ర ను కిడ్నాప్ చేశారు. రాత్రి 11 గంటలు సమయంలో గజేంద్ర ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
హైదరాబాద్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

కారు లో తీసుకెళ్లి గజేంద్ర పై దాడి చేశారు. గజేంద్ర పై దాడి చేసి డబ్బులు డిమాండ్ చేశారు. యాబై లక్షలు ఇస్తాను వదిలేయండి అని భాదితుడు వేడుకున్నాడు. కానీ కిడ్నాపర్లు ఒప్పుకోక పోవడం తో గజేంద్ర , స్నేహితుడు రాహుల్ కి కాల్ చేశాడు. దీంతో రాహుల్ కోటి రూపాయలు డబ్బులు కిడ్నాపర్లు కి ఇచ్చాడు. కోటి సమీపంలోని జ్యుస్ షాప్ వద్ద గజేంద్ర ను వదిలి వెళ్ళారు. ముంబై కి చెందిన ఓ ఫైనాన్స్ ఆటో మొబైల్ ను గజేంద్ర తో పాటు అతని సోదారుడు నడుపుతున్నారు. గతంలో గజేంద్ర సోదరుడు కమిలేశ్ పై చీటింగ్ కేసులు ఉన్నాయి. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని అయన అన్నారు.  టాస్క్ ఫోర్స్ తో పాటు మరో రెండు టీమ్స్ కిడ్నాపర్లు కోసం గాలిస్తున్నామని అన్నారు.

No comments:

Post a Comment