Breaking News

29/07/2019

ముందుకు మూడు..వెనుకకు ఆరు ఆధునీకరణ

నిజామాబాద్, జూలై 29, (way2newstv.in Swamy Naidu)
ఎస్సారెస్పీ కాల్వల కోసం చేపట్టిన పునర్జీవన పథకం పట్టాలెక్కట్లేదు. కాల్వల మరమ్మతుల కోసం జనవరిలో విడుదలైన రూ.19.33కోట్లు మూలుగుతున్నాయి. వెరసి.. గండ్లు పడ్డ కాల్వలు...దెబ్బతిన్న తూములు...మరమ్మ తులకు నోచుకోని ర్యాంపులు, సైడ్‌ డ్రాపులు అట్లాగే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులో నీళ్లున్నా సాగుకు వదలలేని దుస్థితి. ఈయేడూ చి'వరి' 
ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి పెద్దపల్లి జిల్లాలో నెలకొంది.శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చెందిన డీ-83, డీ-86 ఎస్సారెస్పీ కాల్వలు పెద్దపల్లి జిల్లాలో సాగునీరు అంది స్తాయి. సింహభాగం ఆయకట్టు ఈ జిల్లాలోనే ఉంది. డీ-86 కాల్వ కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని వెదురుగట్టు నుంచి మొదలై పెద్దపల్లి జిల్లాలో జూలపల్లి, ఎలిగేడు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లోని 140 గ్రామాల మీదుగా 54 కిలోమీటర్ల పొడవునా ఉంది. దీని కింద 86 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు.
ముందుకు మూడు..వెనుకకు ఆరు ఆధునీకరణ

డీ-83 కాల్వ కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని రేవల్ల వద్ద మొదలై జిల్లాలోని ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి, కమాన్‌పూర్‌, పాలకుర్తి, కాల్వశ్రీరాం పూర్‌, అంతర్గాం, మంథని, ముత్తారం, రామగుండం మండ లాల పరిధిలో 190 గ్రామాల గుండా 84కిలోమీటర్ల మేర వెళ్తోంది. దీని కింద లక్షా 22వేల ఎకరాల ఆయకట్టుంది. ఈ రెండు కాల్వలు గతంలో అనేకమార్లు భారీ వర్షాలతో వరదల తో దెబ్బతిన్నాయి. ర్యాంపులకు గండ్లు పడ్డాయి. తూములు, డ్రాప్‌లు దెబ్బతిన్నాయి. డీ-86 కాల్వకు మొత్తం 81 చోట్ల డ్రాప్స్‌ కొట్టుకుపోగా, 41 ప్రదేశాల్లో తూములు దెబ్బతిన్న ట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డీ-83 కాల్వకు ధర్మారం, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, రామగుండం మండలాల్లో పెద్ద పెద్ద గండ్లు పడి, తూములు పగిలిపోయి మేజర్‌ డ్యామేజ్‌ జరిగినట్టు అధికారులు గుర్తించారు. గండ్లు పడి ఏండ్ల తరబడి కాల్వలు మరమ్మతులకు నోచుకోవట్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు తోపాటు కాల్వలనుఆధునీకరించేందుకు పునర్జీవన పథకం ప్రారంభించారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన పోచంపాడు వద్ద ఈ పనులకు శంకుస్థాపనా చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న డీ-83, 86 కాల్వల మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించా రు. ఆ మేరకు ప్రభుత్వం డీ-86 కాల్వకు రూ.9.33 కోట్లు, డీ-83 కాల్వకు రూ.10 కోట్లు చొప్పున రూ.19.33 కోట్లు జనవరిలోనే మంజూరు చేసిం ది. ఈ నేప థ్యంలో మరమ్మతులకు టెండ ర్లు, ఒప్పందం వంటి ప్రక్రియలో అధికారులు తీవ్ర జాప్యం చేశారు. అగ్రి మెంట్‌ పూర్తి చేసి మే నెలలో పనులు చేపట్టాల్సి ఉండగా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. కాల్వలకు గండ్లు, దెబ్బతిన్న తూముల కారణంగా యే టా నీరంతా వృథా అవుతోంది. ఏయేటికాయేడు ఎస్సారెస్పీలోనూ నీళ్లు లేక కాల్వల పూర్తిసామర్థ్యం మేరకు నీళ్లు వదలడమూ లేదు. 2016 ఖరీఫ్‌లో కాలువల నిండా నీళ్లు వదిలిన క్రమంలో మల్యాల మండలంలో మరమ్మతుకు నోచ ని కాలువకు భారీ గండి పడి 8 గ్రామాలు నీట మునిగిన ఉదంతమూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులోనూ 11టీఎంసీల నీళ్లే ఉన్నాయి. కాలం కలిసొచ్చి వచ్చే యాసం గిలోనైనా నీళ్లు వదిలే పరిస్థితి వస్తే అందుకు తగ్గట్టు కాల్వల పరిస్థితి లేదు. మరోవైపు ఇప్పటివరకు నీళ్లు వదిలిన క్రమం లో జిల్లాలోని ఈ రెండు కాల్వల కింద ఉన్న 2లక్షలా 8వేల ఎ కరాల ఆయకట్టులో కేవలం 90వేల ఎకరాలకు మించి నీళ్లు అందట్లేదు. చి'వరి'పంటలన్నీఎండిపోతున్న పరిస్థితి నెలకొంది.

No comments:

Post a Comment