పత్తికొండ జూలై 29 (way2newstv.in -Swamy Naidu)
కరువు కాటకాలతొ అల్లాడుతున్న పత్తికొండ ప్రాంత రైతులకు సంభందించిన మూగ జంతువులకు ప్రభుత్వం వెంటనే ఆంక్షలు లేని పసుగ్రాసం సరఫరా చేయాలని సిపిఐ మండల కార్యదర్శి రాజసాహేబ్,పెద్దవీరన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు సొమవారం స్తానిక పశు సంవర్తక కార్యాలం దగ్గర రైతులతొ దర్నా నిర్వహించారు.
మూగ జంతువులకు ప్రభుత్వం వెంటనే పశుగ్రాసం సరఫరా చేయాలి
అనంతరం వారు మాట్లడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి వర్షాలు లేక పంటలు పండక మండల పరిదిలొని రైతుకు సంభందించిన ఎద్దులకు ,బర్రెలకు,ఆవులకు,గొర్రెలకు,మేకలకు తదితర మూగ జంతువులకు పశుగ్రాసం లేక నాన ఇబ్బందులు పడి వాటిని సంరక్షణ చేసుకుంటున్నారు. రి కొందరు రైతులు వాటిని కభేళాలకు అమ్ము కుంటున్నారని వారన్నారు సంభందిత పశువైద్యదికారి రైతులతొ ఆధార్ కార్డు ద్వారా కిలో 3 రూపాయల 50 పైసలు రైతులతొ కట్టించుకొని 10 నుంచి 15 రోజులకు పసువులకు పశుగ్రాసం సరఫరా అవుతుందని అయన రైతులకు దాటవేత సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామంలొ మూగ జంతువులను దృస్టిలొ ఉంచుకొని పశుగ్రాసం కొరత లేకుండ నిలువ కేంద్రాలు ఎర్పాటు చేసి ,ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేయాలని కొరారు.
No comments:
Post a Comment