Breaking News

19/06/2019

చంద్రబాబుకు కునుకు కష్టమేనా

విజయవాడ, జూన్ 19 (way2newstv.in)

ఏపి తెలంగాణ ముఖ్యమంత్రులు రెండుగంటలపాటు సాగించిన అంతర్గత చర్చలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. టిడిపి అధికారంలో వున్నప్పుడు కత్తులు దూసుకున్న తీరులో ఇరు రాష్ట్రాల సిఎం లు వ్యవహరిస్తే వైసిపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి కౌగిలింతల ముఖ్యమంత్రులుగా కెసిఆర్, వైఎస్ జగన్ మారిపోయారు. వీరి బలమైన ఐఖ్యత విభజన చిక్కుముళ్ళు విడతీసేందుకు ఉపకరిస్తుందని తెలుగు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎపి ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు అమరావతి వచ్చిన కెసిఆర్ జగన్ తో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. 


చంద్రబాబుకు కునుకు కష్టమేనా
ఎపి సిఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఈ చర్చల వివరాలను ఇద్దరు సిఎం లు వెల్లడించకపోవడంతో వీరి నడుమ భేటీ పై విభిన్న కథనాలు నెట్టింట విహరిస్తున్నాయి.ఇటీవల నీతి ఆయోగ్ లో జగన్ చేసిన ప్రసంగంపై తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే వైఖరితో కేంద్రంపై పోరాడాలని కెసిఆర్ వ్యాఖ్యానించారని అంటున్నారు. సాగునీటి ప్రాజెక్ట్ లు, ఉద్యోగుల బదిలీలు, ప్రత్యేక హోదా, ఆస్తుల విభజన, అప్పుల పంపకం, ఇతర విభజన అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు తరచూ సమావేశం అవుతూ వుండాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఎపి ముఖ్యమంత్రిగా జగన్ ను చూస్తేనే టిడిపి అధినేత చంద్రబాబుకు చిర్రెత్తికొస్తుంది. అలాంటిది జగన్ తో పాటు కెసిఆర్ సైతం అమరావతికి ఆంధ్రప్రదేశ్ కి తరచూ వచ్చి పోతుండటం ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు పసుపు పార్టీలో ఊహాగానాలు ముప్పిరిగొంటున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హడావిడికి రిటర్న్ గిఫ్ట్ తప్పదన్న టి సిఎం కెసిఆర్ ను ఒక కంట కనిపెట్టి వుంటున్నారు తమ్ముళ్లు. ఇద్దరు ఏకంగా రెండుగంటల పాటు ఏకాంత సమావేశం దేనికి సంకేతమన్న ఆందోళన టిడిపి లో పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే టిడిపి కి మరిన్ని చుక్కలు చూపేందుకే అని లెక్కేసిన జగన్, కేసీఆర్ లు ఇకపై తరచూ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

No comments:

Post a Comment