Breaking News

05/06/2019

వినూత్న ప్రచారంతో ప్రభుత్వ స్కూళ్లు...


వరంగల్, జూన్ 5, (way2newstv.in)
విద్యా సంవత్సరం ప్రారంభమైంది.ప్రభుత్వ  విద్యా  సంస్థలు వినూత్న పోకడలతో ముందుకు వెళ్తున్నాయి.ఆ గట్టున రుసుముల మోత.. ఈ గట్టున చదువే ధ్యాస  అంటూ ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం డబ్బులు సర్దుబాటు చేసుకుంటున్నారు. నోట్‌ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు, బ్యాగులు తదితర సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.మరోవైపు  కొన్ని  ప్రైవేట్‌ పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డీవిరుస్తున్నాయి. పోటీపడీ ఫీజులు పెంచుతున్నాయి.ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ పరంగా ఎలాంటి అజమాయిషీ లేకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. 


వినూత్న ప్రచారంతో  ప్రభుత్వ స్కూళ్లు...
దీనికి తోడు వేలల్లో ప్రవేశ రుసుములు సూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఏకంగా నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, టీషర్టులు, అమ్ముతూ అక్రమవ్యాపారం చేస్తున్నారు.ప్రైవేట్‌ పాఠశాలల యజమానులు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం లేదు.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 శాతం ప్రైవేటు బడుల్లో సరైన క్రీడా మైదానాలు లేవు. అగ్నిమాపక భద్రత లేదు. కొన్ని  ప్రైమరీ తరగతుల వరకే గుర్తింపు తెచ్చుకుని ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నాయి.ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ వేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేటు బడుల్లో ఇది ఎక్కడా కనిపించదు. తరగతుల వారీగా ఫీజులను పేరెంట్స్‌ కమిటీలు నిర్ణయించిన మేరకే వసూలు చేయాలి. అయితే కమిటీలు లేకపోవడంతో ఫీజులను అడ్డగోలుగా పెంచుతున్నారు. సరైన విద్యార్హత లేని ఉపాధ్యాయులతోనే బోధన చేయిస్తున్నారు.ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పాఠశాల పేరు ఉన్న దుస్తులు మరెక్కడా లభించకపోవడంతో ఎంత ధర ఉన్నా కొనాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు

No comments:

Post a Comment