Breaking News

06/06/2019

ఖర్చు బారెడు... పనులు మూరెడు

హైద్రాబాద్, జూన్ 6, (way2newstv.in)

జలమండలి పరిధిలోని వివిధ డివిజన్లలో క్షేత్రస్ధాయి అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్ముకై లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్‌ఓసీ) పేరిట నిధులను స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్‌ఓసీ పనుల పేరిట బోర్డు ప్రతిఏటా రూ.15-20 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ప్రధానంగా పొంగిపోర్లే డ్రైనేజీలు, కలుషిత నీటి సరఫరా ఆరికట్టేందుకు పాడైన మ్యాన్‌హోళ్ల మూతలు మార్చడం వంటి నిర్వహణ పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తోంది. జియో ట్యాగింగ్ ద్వారా ప్రతిపాదనలు పంపితే ఒకే ప్రాంతం ఫోటో రెండు మూడు సార్లు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి కొత్త దందాకు తెర తీశారు. ప్రధానంగా పాడైన మ్యాన్‌హోళ్ల మార్పిడిలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అవసరమున్నా , లేకున్నా మ్యాన్‌హోళ్లపై మూతలను మారుస్తున్నారు. బాగున్న మూతల స్ధానంలో పాడైనవి ఉన్నట్లు ఫోటోలలో చూపి పనులు చేస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే డ్రైనేజీ ఓవర్‌ఫ్లో ఆరికట్టేందుకు చేపడుతున్న పనుల్లో అంచనా వ్యయం అమాంతం పెంచుతున్నారు. రూ. 5 నుంచి 10 వేలు ఖర్చు చేస్తూ, అంతకు రెట్టింపు అయినట్లు రికార్డులలో చూపుతున్నారు. బోర్డు వద్ద పేర్లు నమోదు చేసుకున్న గుత్తేదారు సంస్ధలే ఏళ్లుగా పనులు చేస్తుండటంతో అధికారులకు ఆ సంస్ధల మధ్య మంచి అవగహన ఉంది. దీంతో పనులు ఎలా చేయాలి? అయిన ఖర్చుకంటే ఎక్కువ ఎలా చూపాలన్నది సదరు గుత్తేదారు సంస్ధలకు అధికారులు సూచనలు చేస్తున్నారు. సూచిస్తున్నారు. 


ఖర్చు బారెడు... పనులు మూరెడు
ఈ విధం గా క్షేత్రస్ధాయి అధికారులు, కాం ట్రాక్టర్లు కలిసి బోర్డుకు చెందిన కోట్లాది రూపాయల నిధులు కైంకర్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగిన చ ర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ప్రస్తుతం బోర్డు పరిధిలోని ఐదు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ సర్కిళ్లలో ఐదు డివిజన్‌లు, ట్రాన్స్‌మిషన్ సర్కిల్‌లో మూడు డివిజన్లు ఉన్నాయి. వివిధ జలాశయాల నుంచి తాగునీటిని తరలించే బాధ్యత ట్రాన్స్‌మిషన్ సర్కిల్ పరిధిలో ఉండగా, కోర్ ఏరియాలో మురుగు, తాగునీటి నిర్వహణ, శివారు సర్కిళ్లలో తాగునీటి సరఫరాను ఓ అండ్ ఎం విభాగం చూస్తోంది. మహానగరవ్యాప్తంగా బోర్డు పరిధిలో 200 నుంచి 500 ఎంఎం డయా సామర్ధంతో కూడిన 6,083 కిలోమీటర్ల ల్యాటరల్ పైపులైన్‌లు, వాటిపై 2.35 లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. అదేవిధంగా 600 ఎంఎం డయా కంటే ఎక్కువ సామర్ధంతో కూడిన పైపులైన్‌లు 172 కిలోమీటర్ల మేర ఉన్నాయి. చాలవరకు ప్రాంతాల్లో ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కొనసాగుతుండటంతో వాటి ప్రవాహ సామర్ధం కంటే ఎక్కువ మురుగు నీరు వెలువడుతుండటంతో తరుచూ మురుగు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చెత్త చెదారం పైపులైన్లలో చేరడం డ్రైనేజీలు పొంగిపోర్లుతూ మురుగు సమస్యతో ప్రజలు నానా అవస్ధలు పడుతున్నారు. ఈ సందర్భంగా చేస్తున్న మరమ్మతు పనులను బోర్డులోని కొంతమంది అధికారులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో జరిగే పనులపై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేసిన పనుల్లో మాత్రం అవకతవకలు జరుగుతునే ఉన్నాయి. ఆక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్ముకై నిర్వహణ పనులకు వినియోగిస్తోన్న జియో ట్యాగింగ్ పరిశీలనకు చెక్ పెడుతూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు.ప్రతి నెలా ఒక్కో డివిజన్‌కు రూ. 3లక్షల నుంచి రూ.14 లక్షల వరకు కేటాయిస్తున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో ఎల్‌ఓసీ పనుల కోసం కేటాయించిన నిధులకు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంలో నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గత రెండున్నర ఏళ్లుగా ఓ అండ్ ఎం పనులకు జియోట్యాగింగ్ అనుసంధానించారు. ఏదైనా ప్రాంతంలో మురుగు నీటి పైపులైన్ పొంగిపోర్లితే ముందుగా ఆక్షాంశం, రేఖాంశాలతో సహ ఫోటో తీయాల్సి ఉంటుంది. అనంతరం మరమ్మతుకు ఎంత ఖర్చు అవుతుంది అన్నది అంచనా వేసి జియో ట్యాగింగ్ నెంబర్‌తో సహా ప్రతిపాదనలను పై అధికారికి పంపాల్సి ఉంటుంది. రూ.20 వేల వరకు నిర్వహణ పనులకు అనుమతి ఇచ్చే అధికారం జనరల్ మేనేజర్(జీఎం) స్ధాయి అధికారికి ఉంటుంది. రూ.20 వేల కంటే ఎక్కువ అసరమైతే డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ అధికారుల నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బోర్డు నిబంధనలకు విరుద్ధంగా మెజార్టీ స్ధాయి నిర్వహణ పనులకు జీఎం స్ధాయి అధికారే అనుమతి ఇస్తుండటంతో ఆక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ముందుగా ప్రతిపాదనలో పేర్కొన్న మొత్తం కంటే బిల్లు రూపకల్పనకు వచ్చే సరికి ఖర్చు పెరుగుతుంది. పనులు పూర్తయిన తరువాత జీంఎ స్ధాయి అధికారి క్షేత్రస్ధాయిలో తనిఖీ చేసి బిల్లును మంజూరు చేయాల్సి ఉంటుంది. కాని క్షేత్రస్ధాయిలో జీఎంలు కాంట్రాక్టర్లతో కుమ్ముకై పనులను పరిశీలించకుండనే బిల్లు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ పరిస్ధితి దాపురించిందనే విమర్శలు వస్తున్నాయి.

No comments:

Post a Comment