Breaking News

28/06/2019

కాపులు కాసేదెవరికి...


సైకిల్ దిగి....కమలం పుచ్చకొని
న్యూఢిల్లీ, జూన్ 28 (way2newstv.in)
అవును! రాష్ట్రంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ కి అండ‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే, వీరు ఇప్పుడు సైకిల్ పార్టీనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని, త్వ‌ర‌లోనే బీజేపీ కండువా క‌ప్పుకొంటార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా దెబ్బ‌తిన‌డం, మ‌రోప‌క్క‌, త‌మ రిజ‌ర్వేష‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కోర్టులో ఉండ‌డంతో వారు ఈ దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో ఆయ‌న కాపుల‌కు చేయాల్సిందంతా చేశాడు. రిజ‌ర్వేష‌న్ల‌పై ఇచ్చిన హామీకు క‌ట్టుబ‌డ్డారు.అయితే మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం అనూహ్యంగా అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10 శాతం రిజ‌ర్వేషన్ల‌లో 5 శాతం కాపుల‌కే ఇచ్చారు. కాపు కార్పొరేష‌న్ రుణాలు, కాపు విద్యార్థులు విదేశీ విద్య ఇలా కాపుల‌కు ఎక్కువుగా ఇచ్చిన ప్ర‌యార్టీతోనే ఆయ‌న బీసీల్లో కొన్ని వ‌ర్గాల‌కు దూరం చేసుకున్నార‌న్న టాక్ కూడా ఉంది. ఇక ఇంత చేసినా కాపుల ఓట్లు ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన బ‌లంగా ఓట్లు చీల్చుకోవ‌డం వ‌ల్లే గోదావ‌రి, కృష్ణా, విశాఖ లాంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 

కాపులు కాసేదెవరికి...

ఇప్ప‌టికే చంద్రబాబు విదేశాల్లో ఉన్న స‌మ‌యంలో కాకినాడ‌లో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ నాయ‌కులు భారీ స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగానే వారంతా పార్టీ మార‌తార‌నే ఊహాగానాలు వెలువ‌డ్డాయి.దీనికి సంబంధించి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు మాట్లాడుతూ.. తాము అలా పార్టీ మారేందుకు స‌మావేశం కాలేద‌ని, కేవ‌లం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించుకునేందుకు మాత్ర‌మే స‌మావేశ‌మ‌య్యామ‌ని మీడియాకు వివ‌రించారు. అయితే, తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు విదేశాల నుంచి ఏపీకి తిరిగి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బుధ‌వారం ఉద‌యం రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌లు, ఇటీవ‌ల గెలిచి, ఓడిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో భేటీ నిర్వ‌హించారు. అందుబాటులో ఎవ‌రు ఉన్నా ఖ‌చ్చితంగా రావాల‌ని ఆయ‌న ఆదేశాలు కూడా జారీచేశారు. దీనికి ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు వ‌చ్చినా.. కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కులు మాత్రం డుమ్మా కొట్టారు.మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడలోనే ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు సమావేశానికి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే అందుబాటులో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్ బాబు, జ్యోతుల నెహ్రూ వంటి నేతలు కూడా గైర్హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొంది. జ్యోతుల నెహ్రూతోపాటు మీసాల గీత, బూరగడ్డ వేదవ్యాస్, కేఏ నాయుడు గైర్హాజరయ్యారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌రకు కేవ‌లం ఊహాగానాల‌కే ప‌రిమిత‌మైన ఈ నేత‌ల‌పార్టీ మార్పు వ్య‌వ‌హారం ఇప్పుడు ఈ ఘ‌ట‌న త‌ర్వాత బ‌ల‌ప‌డుతోంది. మ‌రోప‌క్క‌, బీజేపీ నాయకులు త్వ‌ర‌లోనే టీడీపీ ఖాళీ అవుతుంద‌ని ప్ర‌క‌టించ‌డం, ఇప్పుడు వీరు ఇలా చంద్ర‌బాబు స‌మావేశానికి గైర్హాజ‌ర‌వ‌డం వంటివి కాపు నేత‌లు ఇక ఎంతో కాలం బాబుకు జై కొట్ట‌ర‌నే ప‌రిస్తితిని ధ్రువ ప‌రుస్తోంది.

No comments:

Post a Comment