Breaking News

28/06/2019

బంగాళాఖాతంలో అల్పపీడనం


విశాఖపట్టణం, జూన్ 28  (way2newstv.in)
బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఒకట్రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు అనుకూలమైన వాతావరణం సముద్రంలో ఉందని, దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత యాక్టివ్‌గా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. 

 బంగాళాఖాతంలో అల్పపీడనం

సముద్ర మట్టానికి 3.1-7.6కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 13 సెం.మీ భారీ వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా గుడివాడలో 7 సెం.మీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని, జులై మొదటి వారంలో దీని ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

No comments:

Post a Comment