Breaking News

17/06/2019

ప్రజలకు జవాబుదారిగా ఉండాలి


నిర్మల్,జూన్,17 (way2newstv.in)
పోలీసులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు  అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొని జిల్లాలోని ఆయా మండలాల నుంచి వచ్చిన ఆర్జీ దారులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో పోలీసు స్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. 


ప్రజలకు జవాబుదారిగా ఉండాలి
ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని, అనుమానాస్పదన వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వస్తే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8333986939కు సమాచారం తెలియజేయాలని కోరారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment