Breaking News

07/05/2019

కొత్త ముఖ్యమంత్రి ఎవరు....

నరాలు తెగ ఉత్కంఠ.. మరో 15 రోజుల నిరీక్షణ
గుంటూరు, మే 6, (way2newstv.in
ఏపిలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం మరో 15 రోజులు కళ్లు కాయలు కాచేలా అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? అన్న ప్రశ్నకు ఆన్సర్ కోసం ఓట్లేసిన కోట్లాది జనాల సైతం నరాలు తెగే ఉత్కంఠతో మే 23 వ తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగియడంతో టిడిపి, వైసిపి, జనసేన నాయకులు పోలింగ్ సరళి ఎలా ఉంది, నియోజకవర్గాల్లో తమ గెలుపోటముల లెక్కలు ఎలా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు రెడీ అవుతున్నారు. ఈ సమీక్షలో పార్టీకి అనుకూలంగా పని చేసిన వారు ఎవరు? పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఎవరు ? అన్నదాని గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో ఎన్నికల్లో పార్టీకి దెబ్బకొట్టి పనిచేసిన పార్టీ నేతలపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కోస్తాలోని ఓ కీలక జిల్లా కేంద్రంలో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఓ నేత ఇద్ద‌రు ఎమ్మెల్యే అభ్యర్థులను నిలువునా ముంచేశారన్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మ్యాట‌ర్ వైసీపీ వ‌ర్గాల్లోనే బాగా ట్రెండ్ అవుతోంది. 


కొత్త ముఖ్యమంత్రి ఎవరు....

గతంలో ఎంపీగా పనిచేసిన ఆ నేత ఎన్నికలకు ముందు తన బంధువులు వైసీపీలో ఉండడంతో వారి ద్వారా పార్టీలో చేరి ఎంపీ సీటు దక్కించుకున్నారు. ఆయన పార్టీలో చేరినప్పుడు తన లోక్‌స‌భ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారట. అటు పార్టీ అధిష్టానంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ అదృష్టం అంటే మనదే అని తెగ మురిసిపోయార‌ట. తీరా నామినేషన్లు పూర్తయ్యాక తన దగ్గర పెద్దగా డబ్బులు లేవని తనపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పడంతో షాక్ తిన్నా…. ఎవ‌రి డబ్బులు వారు సర్దుబాటు చేసుకున్నారట.ఎన్నికలకు రెండు రోజుల ముందు డబ్బు ఓటర్లకు పంపిణీ చేసే టైంలో సదరు ఎంపీ అభ్యర్థి ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ పిలిచారట. ఈ ఎన్నికల్లో మీరు ఖర్చు చేయాల్సిన అమౌంట్ నాకు ఇస్తే అందుకు నేను ఇచ్చేది కూడా కలిపి ఓటర్లకు పంచుతానని చెప్పారట. అందులోనూ ఆయన గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ఆయన డబ్బు పంచుతాన‌న్న రెండు నియోజకవర్గాల్లో ఓ నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆయ‌న త‌మ డ‌బ్బును కూడా ఓట‌ర్ల‌కు జాగ్ర‌త్త‌గా పంచుతార‌ని వాళ్లిద్ద‌రూ న‌మ్మారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన ఆ ఇద్దరు వైసీపీ అభ్యర్ధులు తమ వంతు అమౌంట్‌ కూడా ఆయనకు ఇచ్చి వాళ్లు ప్రచారంలో మునిగిపోయారు. తీరా పోలింగ్‌కు ముందు రోజు తమ నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు వెళ్లలేదని ఫిర్యాదులు రావడంతో వాళ్లు ఆ ఎంపీ అభ్యర్థిని నిలదీయగా ఆయన మాత్రం డబ్బులు పంచేశానని బుకాయించార‌ట.చివరకు అసలు విషయం తెలుసుకున్న వారు అప్పటికప్పుడు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆ ఎంపీ అభ్యర్థిని నిలదీసినా ఫలితం లేకపోయింది. చివరకు అధిష్టానం ఆఖరులో మోసపోయిన ఆ ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు కొంత అమౌంట్ సర్దుబాటు చేసినా అది కూడా ఓటర్లకు సరిగా చేయలేదట. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎన్నికలు అయ్యాక ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధినేత జగన్ ఆయన పార్టీలోకి తీసుకు వచ్చిన ఆయన ఇద్దరు బంధువులను పిలిచి గట్టి క్లాస్ పీకారట. ఎందుకు సదరు ఎంపీ అభ్యర్థి బంధువులలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా టిడిపి యువ నేత పై పోటీ చేసిన వారు కావడం గమనార్హం. ఇక ఆయ‌న మూడో ఎమ్మెల్యే క్యాండెట్ ద‌గ్గ‌ర కూడా డ‌బ్బులు తీసుకోవాల‌ని ప్లాన్ వేసినా ఆయ‌న మీ డ‌బ్బులు కూడా నాకే ఇవ్వండి… నేనే పంచుతాను అన‌డంతో వ్య‌వ‌హారం బెడిసి కొట్టేసింది.

No comments:

Post a Comment