సిద్దిపేట, మే 06 (way2newstv.in)
ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-జిల్లా మేనేజర్ కమటం ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సిద్ధిపేట పట్టణములో గల పలు మీసేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీసేవ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు.
మీసేవ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రభుత్వం నిర్దారించిన ధరల కన్నా అధిక వసూలుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి మీసేవాలో ప్రభుత్వ ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మీసేవా ఆపరేటర్లకు సూచించారు. ప్రజలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరి ఏ ఇతర సర్వీసులకోరకు దళారులను ఆశ్రయించ కూడదని చెప్పారు. మీసేవా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఆపరేటర్లు ఎక్కడైనా నిబంధనలను అతిక్రమించినా టోల్ ఫ్రీ నంబరుకు 1100 కు డైల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు
No comments:
Post a Comment