Breaking News

06/05/2019

రంజాన్ కిట్స్ పంపిణీ.

నంద్యాల మే 06 (way2newstv.in
జమాతె ఇస్లామి నంద్యాల తమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ కిట్స్ లను నిరుపేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేసినట్లు జమాతె ఇస్లామి నంద్యాల శాఖ అధ్యక్షులు సియం జక్రియా తెలిపారు. సోమవారం స్థానిక ముల్లాన్ పేటలోని మేట్రొ కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200 కిట్స్ లను పేద ముస్లింలకు పంపిణీ చేశారు. 


రంజాన్ కిట్స్ పంపిణీ. 

ఈ సందర్భంగా జక్రియా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జమాత్ తరపున నిరుపేద ముస్లింలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని, వారు కూడా రంజాన్ మాసం సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జమాత్ సీనియర్ సభ్యులు మోమిన్ గౌస్ మరియు జమాత్ సాంఘీక సేవ విభాగం కార్యదర్శి పి. షఫీ లు మాట్లాడుతూ రంజాన్ పండుగ నెల సరిపడే విధంగా ఈ కిట్స్ లో బియ్యం తో పాటు చెక్కర, నూనె,కందిబేడలు, గోదుమపిండి,కారంపోడి,పసుపు, తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఆబీద్ అలి, సిద్దీఖ్, రషీద్, పి.వి ముస్తఫా,మస్లిహుజ్జమ, దాదాపీర్,సభ్యులు సైఫూల్లా, సలీం, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment