Breaking News

16/05/2019

ఎన్నికల కోడ్ ముగియగానే రేషన్ కార్డులు

వరంగల్, మే 16, (way2newstv.in)
 కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సర్కారు కసరత్తు ప్రారంభించింది. కోడ్ ముగియగానే జూన్ ఒకటి నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కొత్త కార్డులను అందజేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం మొదటి సారిగా 2015 జనవరిలో ఆహార భద్రత కార్డులను అందజేసింది. అప్పడు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఎఫ్‌ఎస్‌సీ కార్డులు అందలేదు. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. రేషన్ సరుకుల కోసం తాత్కాలిక కార్డులను అందజేసినా శాశ్వత రేషన్‌కార్డులు ఇంత వరకు రాలేదు. ఐదేండ్లలో చాలామంది పెండ్లిళ్లు చేసుకొని కుటుంబంతో కాకుండా వేరుగా ఉంటున్నవారు.. ఇప్పటి వరకు కార్డులు లేనివారు.. గతంలో దరఖాస్తు చేసుకున్నా మంజూరు కానివారు.. కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకొని ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వీరందరికి కొత్త కార్డులు అందనున్నాయి.గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. సుమారు 13 నెలలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో 18 మండలాల పరిధిలో ఇప్పటి వరకు 27,171 దరఖాస్తులు వచ్చాయి. 


ఎన్నికల కోడ్ ముగియగానే రేషన్ కార్డులు

మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించడంతో అధిక సంఖ్యలో త హసీల్దార్ లాగిన్‌కు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం నిబంధనలు కూడా విధించడంతో దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఐదుగురికి కలిపి ఒక రేష న్ కార్డు ఉండగా.. ఆ కుటుంబంలో ఎవరైనా ఒక రు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతారు. అయితే ఆ రేషన్ కార్డులో ఉన్న సదరు కుటుంబ సభ్యులెవరు ఐదేళ్ల వరకు ఎలాంటి లబ్ధి పొందరాదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబంలో పెళ్లి చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డు కో సం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. కాగా.. ఇప్పటి వరకు అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్‌లోనే 5,834దరఖాస్తులు రా గా.. అతి తక్కువ నార్నూర్ మండలంలో 437 దరఖాస్తులు వచ్చాయి. అయితే మీసేవ ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులపై ముందుగా గిర్దావర్ క్షేత్రస్థాయి విచారణ జరుపుతారు. సదరు గిర్దావర్ ఆర్‌ఐ అప్రూల్ చేస్తే తహసీల్దార్ లాగిన్‌కు చేరుతాయి. అక్కడ డీఎస్‌వో నుంచి పౌరసరఫరాల కమిషనర్‌కు పంపుతారు. కమిషనర్ ఆమోదిస్తే కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి.జిల్లాలో కొత్తరేషన్ కార్డులకు మొత్తం 27,171 దరఖాస్తులు రాగా.. అందులో 7,039 దరఖాస్తు లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 20,132 దరఖాస్తులకు కొత్త కార్డులు ఇవ్వవచ్చని జిల్లా స్థాయి అధికారులు కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1,027దరఖాస్తులు మాత్రమే అప్రూవల్ లభించగా.. మిగతా వాటికి లభించలేదు. మరో 176 దరఖాస్తులను కమిషనర్ కార్యాలయం అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు.7,039 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో విచారణ జరపాల్సినవి 6,136 దరఖాస్తులు ఉండగా.. తహసీల్దార్ లాగిన్‌లో 546 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు స్థా యిల నుంచి డీఎస్‌వో లాగిన్‌కు వచ్చిన మరో 357దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. వ చ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నదని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని డీఎస్‌వో తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఏమైన సందేహాలు ఉంటే కార్యాలయనికి వచ్చి తెలుసుకోవాలని పేర్కొన్నారు.

No comments:

Post a Comment