Breaking News

23/04/2019

కూతురు బాయ్ ఫ్రెండ్స్ తో మహిళ సెక్స్..

కాలిఫోర్పియా, ఏప్రిల్ 23  (way2newstv.in)
ఓ మహిళ తన కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను లోబరుచుకుంది. 21 సార్లు వారితో సెక్స్‌లో పాల్గొని ఊచలు లెక్కిస్తోంది. కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కరాల్ లైటిల్ అనే 41 ఏళ్ల మహిళకు ఇద్దరు టీనేజ్ కుమార్తెలు ఉన్నారు. వారిద్దరు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను తల్లిదండ్రులకు పరిచయం చేశారు. అప్పటి నుంచి వారి బాయ్‌ఫ్రెండ్స్ నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఈ సందర్భంగా లైటిల్‌కు వారితో పరిచయం ఏర్పడింది. సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్న లైటిల్‌.. ఆ ఇద్దరితో కామవాంఛ తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. 


కూతురు బాయ్ ఫ్రెండ్స్ తో  మహిళ సెక్స్..

ఈ సందర్భంగా వారిని లోబరుచుకుని తన లైంగిక కోరికలు తీర్చుకొనేది. తన కారులో విసేలియాకు తీసుకెళ్లి మందు, సిగరెట్లు ఇచ్చి వారితో ఆ పని కానిచ్చేది. ఆ ఇద్దరిలో ఒక కుర్రాడు ఆమెతో సెక్స్‌ చేయడం ఇష్టం లేక తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. లైటిల్ భర్త ఎంతో మంచివాడని, అతన్ని మోసం చేస్తున్నా అనే పశ్చాతాపంతో ఆ యువకుడు లైటిల్ ఇంటికి వెళ్లడం మానేశాడు. అయితే, లైటిల్ మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. ఇంటికి వచ్చి తనతో గడపాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చేది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయ్యింది. ఆ కుర్రాళ్లిద్దరూ 14, 15 ఏళ్ల టీనేజర్లే కావడంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లైటిల్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయం తెలిసిన తర్వాత లైటిల్ కుమార్తెలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆమె భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 

No comments:

Post a Comment