Breaking News

08/04/2019

వేసవితో నీటికి కటకట

మొసళ్ల కేంద్రంలో కష్టాలు 
మంచిర్యాల, ఏప్రిల్ 7, (way2newstv.in
గలగల పారే గోదావరి.. కనుచూపు మేర నీటిప్రవాహం.. చుట్టూ పచ్చని చెట్లు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయం.. ఏడాది పొడవునా జలకళతో ఉండే నదిలో వెలసిన ప్రకృతి సిద్ధమైన నీటిమడుగు.. నది ఒడ్డున ఆనుకొని ఉండే ఎత్తైన గుట్టలు. ఇదంతా ఎక్కడో కాదు మంచిర్యాల జిల్లాలోని జైపూరు మండలం శివ్వారం అభయారణ్యంలోని మొసళ్ల మడుగు కేంద్రం ప్రత్యేకత.. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఈ మడుగు వేసవిలో పర్యాటకులను కనువిందు చేయనుంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం(ఎల్‌మడుగు) ప్రకృతి అందాలకు నెలవు. చుట్టూ ఎతైన గుట్టలు.. మధ్యలో గోదావరి  నీటిప్రవాహం.. అందులో మొసళ్ల నివాసం ఇక్కడి ప్రత్యేకత..  మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో ఉన్న శివ్వారం మొసళ్ల మడుగు కేంద్రం ఎంతో పురాతనమైంది. కాకతీయరాజుల కాలం నుంచే దీనికి పేరుంది. కాకతీయులు వరంగల్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) మంథని నుంచి శివ్వారం మీదుగా చెన్నూరుకు రహదారిని ఏర్పాటు చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పట్లో మునీశ్వరులు నివాసాలు ఏర్పరుచుకొని ఈప్రాంతంలో నివసించేవారని చెబుతారు. ఇక్కడి సువిశాల ప్రదేశంలో గోదావరినది, దట్టమైన అటవీప్రాంతం, గుట్టలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ....జైపూరు మండలం కుందారం నుంచి చెన్నూరు మండలంలోని బీరెల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర గోదావరినది విస్తరించి ఉన్న ప్రాంతాన్ని మొసళ్ల మడుగు కేంద్రంగా అటవీశాఖ గుర్తించింది. 


వేసవితో నీటికి కటకట

సుమారు 37 ఏళ్ల కిందట 1978లో పుష్పకుమార్‌ అనే వైల్డ్‌లైఫ్‌ నిపుణుడు ఈప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడై ఈప్రాంతంలోని అభయారణ్యం, జీవజాతులపై అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. దీంతో అప్పటి  ప్రభుత్వం ఈప్రాంతాన్ని మొసళ్ల పునరావాస కేంద్రంగా ప్రకటించింది. అప్పటి నుంచి మొసళ్లను అటవీశాఖ ఆధ్వర్యంలో సంరక్షిస్తున్నారు. మడుగులో సుమారు 60కి పైగా మంచినీటి, ఉప్పునీటి మొసళ్లు ఉన్నాయి.. వర్షాకాలంలో మొసళ్లు సమీపంలో ఉన్న పంటపొలాల్లోకి సైతం వస్తాయి.. కొద్ద రోజుల క్రింద  బీరెల్లిలో పంటపొలాల్లోకి వచ్చిన మొసలిని అటవీశాఖ అధికారులు బంధించి తిరిగి మడుగులో వదిలారు.శివ్వారం అభయారణ్యం  అనేక వృక్ష, జంతుజాతులకు నిలయం. చుక్కల దుప్పులు, నీలుగాయిలు, ఇప్పపిల్లులు, అడవిపందులు, ముళ్లపందులు, జింకలు, కొండగొర్రెలు, నీటికుక్కలు, తదితర జంతుజాతులు ఈ అభయారణ్యంలో  నివసిస్తున్నాయి. నల్లమద్ది, తిర్మణి, చెన్నెంగ, ఏగీస, బూరగ, అందుగు, సిందుగు, కొడిశ, పాల అరుదైన వృక్షజాతులున్నాయి. మొసళ్ల సంరక్షణతో పాటు వృక్ష, జంతువుల రక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. .అయితే అన్ని రకాల పర్యాటకులను ఆకర్షేంచే విధంగా ఉన్న మొసళ్ల సంరక్షణ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రం  దారి సక్రమంగా లేదు. శివ్వారం నుంచి మడుగుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నా.. సౌకర్యాలు లేకపోవడంతో రాలేకపోతున్నారు. పర్యాటక స్థలంగా తీర్చిదిద్దితే ఇక్కడికి సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు కోరుతున్నారు.శివ్వారం అటవీ ప్రాంతంలోని మొసళ్ల కేంద్రం ప్రాంతంలో గుట్టలపైన పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిని పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కోమటి మడిగెలు అనే గుహలకు ఎంతో చారిత్రాత్మక ప్రధాన్యాత ఉంది . ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగాలు పూర్తిగా శిథిలమయ్యాయి. చారిత్రక ఆలయాలకు మరమ్మతులు చేపట్టి వాటి చరిత్రను కాలగర్భంలో కలిసిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జిల్లా ప్రజలు అంటున్నారు ...పర్యాటకుల కోసం ఒక్క బోట్ ఏర్పాటు చేసిన రావడానికి సరైన వసతులు లేక పోవడం తో ప్రజలు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం(ఎల్‌మడుగు)ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారుచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం అని అటవీ శాఖా అధికారులు చెపుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు  ... మొసళ్ల మడుగు సంరక్షణ కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోని ఎల్ మడుగు  మొసళ్ళ  సంరక్షణ కేంద్రాన్ని అభివ్రుది పర్చాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు ...ఏడాది కిందట అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యయంతో వాచ్‌టవర్‌ నిర్మించారు. గుట్టపైన ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌ నుంచి ఇక్కడి ప్రకృతి అందాల ను , మొసళ్ల మడుగును వీక్షించవచ్చు. గుట్ట కిందిభాగంలో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. గోదావరి తీరం నుంచి అక్రమ కలపరవాణా నివారణ కోసం మరపడవను కొనుగోలు చేశారు. మరో మరపడవను బోటింగ్‌ కోసం కేటాయిస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు ..పర్యాటక ప్రాంతంగా తిరిచిద్ద్దేందుకు అని అవకాశాలు ఉన్న ఎల్ మడుగును ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకుండా పోవడం తో అటవీ అందాలను పర్యాటకులు తిలకించలేక పోతున్నారని జిల్లా వాసులు ఆవేదన చెందుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  మరో కాశ్మీర్ గా పిలుచుకొనే  ఉమ్మడి ఆదిలాబాద్ అందాలను గుర్తించి పర్యటక కేంద్రాలుగా చేస్తే వెనకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివ్రుదిలో ముందుంటుందని జిల్లా వాసులు  కోరుతున్నారు ....

No comments:

Post a Comment