Breaking News

03/04/2019

పోటీలో 11 శాతం మందే మహిళలు

విజయవాడ,  ఏప్రిల్ 3  (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ. రాష్ట్రంలో మొత్తం 3,69,33,091 ఓటర్లు ఉంటే ఇందులో పురుషులు 1,83,24,588 కాగా, స్త్రీ ఓటర్లు 1,86,04,742.కానీ, చట్ట సభల్లో ప్రాతినిధ్యం, ఎన్నికల్లో పోటీ విషయంలో మాత్రం పురుషులకు ఆమడదూరంలో మహిళలు ఉన్నారు.2014 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి మొత్తంగా 2,153 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో 1,974 మంది పురుషులు. మహిళల అభ్యర్థుల కేవలం 179. ఇక రాష్ట్రంలో మొత్తం 175 శాసన సభ స్థానాలకుగాను గత ఎన్నికల్లో 20 మంది మహిళలు ఎన్నికయ్యారు. 


 పోటీలో 11 శాతం మందే మహిళలు

ఏపీ చట్టసభల్లో గత ఎన్నికల సమయంలో వారి ప్రాతినిధ్యం 11 శాతానికే పరిమితమైంది.ఈసారి ప్రధాన పార్టీలు మహిళా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు పెద్దపీట వేస్తూ హామీలిచ్చినా టికెట్ల కేటాయింపులో మాత్రం పాత ధోరణినే అవలంభించాయి.ఎక్కువగా రిజర్వుడు స్థానాల్లోనే మహిళా అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు కొవ్వూరు, సింగనమల.. ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు పాడేరు, రంపచోడవరంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళలే కావడం దీనికి ఉదాహరణ.మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను అధికార టీడీపీ 20 మంది మహిళలకు టికెట్లు కేటాయించగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ 11 మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించింది. 

No comments:

Post a Comment