కడప, ఏప్రిల్ 3 (way2newstv.in)
గెలుపు కోసం వైసీపీ శ్రేణులు సామదాన బేధ దండోపా యాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా గెలుపు కోసం కుయుక్తులు పన్నుతున్నాయి. తెలంగాణాలో జరిగిన ఎన్నికల అక్రమాలను ఆదర్శంగా తీసుకోవడమే కాక, ఆ రాష్ట్ర నాయకుల వద్ద.. ఎన్నికల్లో అక్రమాలపై తర్ఫీదు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులకు బెదిరింపు కార్యక్రమం పూర్తి కావడం, నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియడంతో ఇక టీఆర్‌ఎస్ నాయకులు తెలుగుదేశం ద్వితీయశ్రేణి నాయకులను ఎలా లొంగదీసుకోవాలనే విషయంపై వైసీపీ నాయకులకు, తెలంగాణాలో తాము అవలంబించిన పద్ధతులను నూరిపోస్తున్నారు. తెలంగాణాలో 25 లక్షల ఓట్లు తొలగించిన విధంగానే, ఆంధ్రాలో కూడా 9 లక్షల ఓట్లు తొలగించటానికి వైసీపీ నాయకులు, టీఆర్‌ఎస్ నాయకుల సలహాతోనే ఫారం-7 ద్వారా యత్నించిన విషయం తెలిసిందే.అయితే తెలుగుదేశం శ్రేణులు అప్రమత్తమై ఓట్ల తొలగింపుపై దృష్టి సారించడంతో కుట్ర బయటపడింది. ఫారం -8 ద్వారా తిరిగి ఓట్లు పొందే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేపట్టినా, ఇంకా 2లక్షల ఓట్లు తొలగింపబడే ఉన్నాయి.
ప్లాన్ బీపై దృష్టి సారించిన జగన్ టీమ్
ప్లాన్‌ఏ పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడంతో టీఆర్‌ఎస్ నాయకులు తమ రాష్ట్రంలో అవలంబించిన ప్లాన్‌బిని అమలు చేయాలని తమ మిత్రులైన వైసీపీ నేతలకు సూచిస్తున్నారు. ఈమేరకు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నారు. ఇది ఫెయిల్ అవ్వటంతో, ప్లాన్ బి కి పదును పెడుతున్నారు... పోలింగ్ రోజున బూత్‌ల్లో ఉండే ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తారు. దొంగ ఓటర్లను గుర్తించడంలో వీరిది కీలకపాత్ర. సంస్థాగతంగా బలంగా ఉండే టీడీపీకి పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఇప్పటి వరకు ఎదురు లేదు. ఈ బలమైన వ్యవస్థను తమ గుప్పిట పట్టాలన్న లక్ష్యంతో వైసీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.స్ర్కీన్ప్ లే, దర్శకత్వం అంతా తెలంగాణలోని టీఆర్‌ఎస్ నాయకులే చేస్తుంటే వైసీపీ నేతలు కేవలం పాత్రధారులుగా ఉంటూ వారి చెప్పినట్టు నటిస్తున్నారు. టీఆర్‌ఎస్ సూచిస్తున్న ప్లాన్ బి ప్రకారం.. బూత్‌ల వారీగా ఏజెంట్లగా నియమితులైన వారి పేర్లు బయటకు రాగానే సదరు ఏజెంట్లను ప్రలోభపెట్టి.. లేకుంటే భయపెట్టి పోలింగ్ రోజున చివరి రెండు గంటలు తమకు అనుకూలంగా మలుచుకోవడమే ప్లాన్ బి లక్ష్యం. సహజంగా ఒక్కో పార్టీకి బూత్‌కి ఇద్దరు ఏజెంట్లు ఉంటారు (ఒకరు రిలీవర్) సహజంగా ప్రధానపార్టీల వారే బూత్ ఏజెంట్లను నియమించుకుంటారు. ప్లాన్(బి) ప్రకారం.. ఒక్కో బూత్‌లో ఏజెంట్ల సంఖ్యను బట్టి లక్షనుంచి రూ.2లక్షల వరకు ఖర్చుచేసి ఏజెంట్లను వారితోపాటు పోలింగ్ అధికారులను తమకు అనుకూలంగా లొంగదీసుకోవడానికి వైసీపీ శ్రేణులు సమయాత్తమవుతున్నాయి. దీంతో తెలుగుదేశం అప్రమత్తం అయ్యింది.
No comments:
Post a Comment