Breaking News

18/03/2019

కోదండరాంతో రేవంత్ భేటీ

హైదరాబాద్, మార్చి 18, (way2newstv.in)
టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  సోమవారం ఉదయం తెలంగాణ జనసమితి అధినేత ప్రొ.కోదండరామ్ తో భేటీ అయ్యారు.  మల్కాజి గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నని విషయం తెలిసిందే. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కోదండరామ్ తో సమావేశమయ్యారు. ఇరువురు దాదాపు గంట సేపు చర్చించారు. రేవంత్ అభ్యర్ధను కోదండరాం సానుకూలంగా స్పందించారని రేవంత్ అన్నారు. మల్కాజిగిరి మినీ భారత దేశం.


కోదండరాంతో రేవంత్ భేటీ

 మల్కాజిగిరి సమస్యలపై పోరాడుతా. తెలంగాణ ఇవ్వడమే కాదు, చాలా తెలంగాణ కు చాలా హామీలను ఇచ్చింది కాంగ్రెస్ అని అయన అన్నారు. మల్కాజిగిరి లో గెలవడానికి కోదండరామ్  సహకారం చాలా అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతా అంటున్నాడు.  ఇంకెప్పుడు ఎన్నికలు అయిపోయాక పార్టీ పెడతారా అని ప్రశ్నించారు. 16 గెలిస్తే ఢిల్లీ లో చక్రం తిప్పుతా అంటున్నాడు, గత ఐదు ఏళ్లు కుడా 165 మంది ఎంపీ లు ఉన్నారు, ఎమ్ సాధించారని అన్నారు.  కోదండరాం మాట్లాడుతూ  మల్కాజ్ గిరి లో  తనకు మద్దతు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడిగారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు ఉండాలి. రేవంత్ కు మద్దతు విషయం పార్టీలో చర్చించి మా నిర్ణయం చెప్తామని అన్నారు.,

No comments:

Post a Comment