Breaking News

18/03/2019

ముందుకు సాగని ఎంఎంటిఎస్

హైద్రాబాద్, మార్చి 18, (way2newstv.in)
నగరంలో సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులు బాగా వినియేగించుకునే ఎంఎంటీఎస్ సేవలు విస్తరణకు నోచుకోవడం లేదు. రెండో దశ 2017 చివరి నాటికి అందుబాటులోకి రావాల్సి ఉండగా గడువును 2018 చివరి నాటికి పెంచారు. అది కూడా నెరవేరలేదు. సికింద్రాబాద్ నుంచి లాలాగూడ, మల్కాజిగిరి మీదుగా బొల్లారం వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ లైను మాత్రం సిద్ధమైంది. ఏడాది క్రితం ఈ లైనులో రైళ్లు నడపవచ్చునని రైల్వే భద్రతా సంఘం పరీక్షించి అనుమతిచ్చింది. 
మేడ్చెల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా డెమూ రైళ్లు నడుస్తున్నాయి. ఇటీవల ఈ మార్గంలో ఉన్న స్టేషన్లలో అభివృద్ధి పనుల పేరిట వీటిని రద్దు చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు అనుగుణంగా రైళ్లను నడపాలని స్టేషన్ల అభివృద్ధిని పూర్తి చేశారు. ఎటొచ్చీ కొత్త రైళ్లు రాకపోవడంతో సర్వీసులను కొనసాగించ లేకపోతున్నారు. 


 ముందుకు సాగని ఎంఎంటిఎస్

ఇలాంటి పరిస్థితుల్లో డెమూ రైళ్లనే ఎంఎంటీఎస్ రైళ్ల మాదిరి నడిపిస్తే  ప్రయా ణికులకు వెసులుబాటుగా ఉంటుంది.ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి  నిధులు సరిగా అందకపోవడంతో పనుల జప్యం జరుగుతోందని ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఘం ప్రతినిధుల చెబుతున్నారు. మొత్తం రూ.816 కోట్లతో చేపడుతున్న ఎంఎంటీఎస్ రెండో దశ వ్యయంలో ఒక వంతు రైల్వే రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే తమ వాటాగా రూ.272 కోట్లను ఇప్పటికే రైల్వే వెచ్చించింది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయిలే అనే ధీమాతో మరో రూ.వంద కోట్ల వరకూ ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 544 కోట్లకు గాను ఇప్పటి వరకూ కేవలం రూ.200 కోట్ల వరకూ ఇచ్చింది. ఇదే విషయాన్ని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గత జీఎం వినోద్‌కుమార్  వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాగా రావాల్సిన నిధులు వస్తే రెండోదశను పూర్తి చేస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశ నిర్ణయించినప్పుడు కొత్త రైళ్ల ప్రస్తావన రాలేదని.. వాటిని కొనడానికి అదనంగా డబ్బులు సమకూర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే నివేదించింది. అయినా ఫలితం లేకపోయింది.

No comments:

Post a Comment