Breaking News

18/03/2019

లబ్దిదారులను కలుపుకుపోవాలి

అమరావతి, మార్చి 18, (way2newstv.in)
ఎక్కడికెళ్లినా తెలుగుదేశం పట్ల అపూర్వ ఆదరణ లభిస్తోంది. రైతులు, మహిళలు, యువత తోడ్పాటుతో ఎన్నిక ఏకపక్షంగా వుంది. లబ్దిదారులంతా తెలుగుదేశం పార్టీకే మద్దతు
నామినేషన్ల రోజే టిడిపి గెలుపు ఖరారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం అయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ అన్నివర్గాల లబ్దిదారులను కలుపుకుపోవాలి. టిడిపి గెలుపులో అందరినీ భాగస్వాములను చేయాలి. అలెగ్జాండర్ కు 10లక్షల సైన్యం ఉండేది. తన సైన్యంలో ప్రతి ఒక్కరూ అలెగ్జాండరే అనేవారు. అందుకే అలెగ్జాండర్ ప్రపంచాన్నే గెలిచాడు. 
తెలుగుదేశం పార్టీకి 65లక్షల సైన్యం ఉందని అయన అన్నారు. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారు టిడిపి కార్యకర్తలు. గత 5ఏళ్లలో టిడిపికి వ్యతిరేకులు తగ్గిపోయారు. రోజురోజుకూ టిడిపికి మద్దతుదారులు పెరుగుతున్నారని అయన అన్నారు. తటస్థులు, మేధావుల్లో టిడిపిపైనే  ఆదరణ పెరిగింది. రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఊహించని ఆధిక్యతలు వస్తాయి. 


లబ్దిదారులను కలుపుకుపోవాలి

నీళ్లిచ్చాం, ఖర్చులు తగ్గించాం, రైతుల రాబడి పెంచాం. రేషన్ పెంచాం.  పండుగకానుకలు, అన్నాకేంటిన్లు పెట్టామని అన్నారు. ఫీజులు చెల్లించాం. ఉపాధి కల్పించాం. గౌరవం పెంచాం. పెళ్లికానుకలు. పసుపు కుంకుమ,  10 రెట్ల పించన్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్లు నిర్మించాం,భరోసా పెంచామని అన్నారు. ప్రతి ఇంట్లో అయిదారు రకాల ప్రభుత్వ లబ్ది అందింది.  ఇన్నిచేసిన టిడిపికి కాక మరోపార్టీకి ఓటెలా వేస్తారు..? వైసిపికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుంది. వైసిపికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలవుతుంది. వైసిపికి ఓటేస్తే దాడులు, దౌర్జన్యాలు పెరుగుతాయని అన్నారు. వైసిపికి ఓటేస్తే, భూములు, ఆస్తులకు భద్రత ఉండదు. అమానుషాలకు పాల్పడేవారికి ఓటడిగే హక్కేలేదు. పోలవరం పూర్తి చేసే తెలుగుదేశం పార్టీ కావాలా..?  పోలవరానికి కేసులతో అడ్డంకులు పెట్టే వైకాపా కావాలా..?  రాజధాని నగర నిర్మాణం పూర్తి చేసే టిడిపి కావాలా..? అరటితోటలు తగులపెట్టి అరాచకం చేసే వైసిపి కావాలా..?  రాయలసీమకు నీళ్లిచ్చే తెలుగుదేశం పార్టీ కావాలా..? ఫాక్షన్ రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు బలిచేసే వైసిపి కావాలా..? నీళ్లిచ్చిన తెలుగుదేశానికి కాక మరెవరికి ఓటేస్తామని ప్రశ్నించాలని అన్నారు. పోలవరంపై పిటిషన్లు వేసేవాళ్లకు ఏపిపై మాట్లాడే హక్కు లేదు. ఆంధ్రా వ్యతిరేకులతో అంటకాగే పార్టీకి ప్రజలే బుద్దిచెప్పాలి. చిన్నాన్నతో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వైరాలు వున్నాయి. చిన్నాన్ననే కొట్టాడని గతంలో జగన్ పై మీడియాలో వచ్చింది. ఎంపిగా రాజీనామా చేయాలని చిన్నాన్నకే, గతంలో జగన్ బెదిరింపులు చేసాడని అన్నారు. సోనియా హెచ్చరించాకే జగన్ వెనక్కి తగ్గాడని వచ్చింది. మొదటినుంచి వివేకానంద రెడ్డికి వేధింపులు జగన్ నుండే.  సొంతఛానల్ లోనే గుండెనొప్పి డ్రామా నడిపించారు. హత్య అనేది బైటపడ్డాక జగన్నాటకం మారింది. సిట్ విచారణలో అసలు నిజాలన్నీ బైటకు వస్తాయి. వివేకానంద రెడ్డి హత్యలో దోషులను వదిలేదిలేదని చంద్రబాబు స్పష్టం చేసారు.

No comments:

Post a Comment