Breaking News

29/03/2019

రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత తెదేపాదే

తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు
అమరావతి మార్చ్ 29 (way2newstv.in)
పారిశ్రామిక, క్షీర, హరిత విప్లవాల తరహాలోనే రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత తెదేపాదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదరికం లేని ఆనందదాయక సమాజం ఏర్పాటే తెదేపా లక్ష్యమని, ఈ సంక్షేమ విప్లవాన్ని ఎన్టీఆర్‌కు అంకితం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం సభ్యులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం ఆకాంక్షించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య వేడుకగా జరపాలన్నారు. ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.


రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత తెదేపాదే

38 ఏళ్లుగా తెదేపాని గుండెల్లో పెట్టుకొని, పసుపు జెండా భుజాన మోస్తున్న సైనికులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 8 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీకీ దక్కని గౌరవం తెదేపాకి దక్కిందని, మొత్తం 23 ఏళ్ల అధికారం ప్రజల్లో తెదేపా ఆదరణకు నిదర్శనమన్నారు. "ప్రజలే ముందు (పీపుల్ ఫస్ట్)’’, ‘‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు’’- అన్న ఎన్టీఆర్ బాటే తమ మార్గమని తెలిపారు. సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, జనాభాలో 98 శాతం మందికి ప్రభుత్వ లబ్ధి అందడం ఒక చరిత్ర అన్నారు. 38 ఏళ్ల పూర్తి పరిపక్వతతో తెలుగుదేశం పార్టీ ఉందని, అద్భుతాలు సృష్టించే నడి వయసులో ఉన్నామన్నారు. సకల జనుల సౌభాగ్యం తెలుగుదేశం లక్ష్యమని స్పష్టంచేశారు. ఒక కులానికో, ఒక ప్రాంతానికో తెదేపా పరిమితం కాదని, చంద్రబాబు అందరివాడని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు తెలుగుదేశం అండగా ఉంటుందని తెలిపారు. ఆనంద ఆంధ్రప్రదేశ్ తమందరి లక్ష్యమని, అందరికీ ఆమోదయోగ్య పాలన ఇస్తామన్నారు.గాజువాకలో గర్భిణిపై వైకాపా నేతల దాడి అమానుషమని, వైకాపా అరాచకాలను అందరూ ఖండించాలన్నారు. నేరగాళ్ల పార్టీ వైకాపాను చిత్తుగా ఓడించాలని, జగన్‌కు ఓటేస్తే నేరగాళ్లకు ఓటేసినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

No comments:

Post a Comment