హయత్‌నగర్ మార్చ్ 29 (way2newstv.in)
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు యజమాని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్ రాహుల్ తన కారులో (టీఎస్09ఈజడ్7989) శుక్రవారం ఉదయం ఔటర్ రింగురోడ్డు వైపు వెళ్తున్నాడు.
అకస్మాత్తుగా కారులో మంటలు.. సురక్షితంగా బయటపడ్డ యజమాని
ఉదయం 10:10గంటల సమయంలో కారు హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వెంటనే కారును రోడ్డు పక్కగా నిలిపిన అతడు కారు లోంచి దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
No comments:
Post a Comment