Breaking News

14/02/2019

కొలిక్కి వచ్చిన భూ నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ

కరీంనగర్, ఫిబ్రవరి 14, (way2newstv.in)
హైకోర్టు ఆదేశాలతో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా సింగరేణి భూ నిర్వాసితులైన కూలీలకు 750 పని దినాలు, రోజుకు వేతనం రూ. 288.30, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఆమలులో ఆలస్యం క్రింద ప్రతి లబ్ధిదారులకు అదనంగా రూ. 30 వేలు, ప్లాటు కొరకు రూ. 3.25 లక్షలు ఇతర బెనిఫిట్స్ కలుపుకొని ఏక మొత్తంగా రూ. 6,98,417 నిర్ణయించారు. పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 


కొలిక్కి వచ్చిన భూ నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ   

ఈ నిర్ణయించిన ఈ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని తీసుకోవాలనే లబ్ధిదారులు మంథని ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక ఫార్మట్‌లో ఉన్న పత్రాన్ని నింపి, సంతకం చేసి తమ అంగీకార పత్రాన్ని ఆర్డీఓకు సమర్పించాలని సూచించారు. ఆర్జీ -2 పరిధిలోని ఓసీపీ - 3 విస్తరణలో భాగంగా పెద్దంపేట, మంగళ్‌పల్లె గ్రామాలను 2007 నుంచి 2010 మధ్య కాలంలో తీసుకుని ఇండ్లకు నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ప్రభుత్వం చేసిన సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం 2135 మంది లబ్ధిదారులను ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి అర్హులుగా గుర్తించారు.అప్పటి నుంచి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లింపులో జాప్యం కాగా, ఎట్టకేలకు డిసెంబర్ 2017లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని ప్లాటు ధరతో కలిపి కూలీకి రూ. 5.97 లక్షలు, విద్యార్థులు, సింగరేణి కార్మికులకు రూ. 4.13 లక్షలు నిర్ణయించారు. ఈ ప్యాకేజీ ప్రకారం సుమారు వెయ్యి మంది వరకు మాత్రమే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని తీసుకోగా, మిగిలిన వారు తీసుకోలేదు.అధికారులు నిర్ణయించిన ఈ ప్యాకేజీతో పొలిస్తే కోర్టుకు వెళ్లిన వారికి రూ. లక్షకు పైగా అదనంగా లబ్ధి జరుగున్నది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లిన సుమారు 70 మంది నిర్వాసితులకే ఈ ప్యాకేజీ వర్తిస్తుందని అధికారులు తెలుపుతుండగా, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ తీసుకోని తమకు సైతం హైకోర్టుకు వెళ్లిన వారితో సమానంగా చెల్లించాలని ప్యాకేజీ తీసుకోని సుమారు వెయ్యి మంది లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. మరీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జేసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!.

No comments:

Post a Comment