Breaking News

08/02/2019

రెండో వన్డేలో భారత్ విజయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (way2newstv.in)
న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌‌ గెలుపు అవకాశాల్ని భారత్ జట్టు సజీవంగా ఉంచుకుంది.న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగడంతో 159 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. రోహిత్ కేవలం 29 బంతుల్లో 50 పరుగులు చేయగా.. ధావన్ 30, పంత్ 40, ధోనీ 20 పరుగులు చేశారు. తొలి టీ20లో టాపార్డర్ కుప్పకూలడంతో టీమ్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఆ తప్పిదం ఈ మ్యాచ్‌లో జరగకుండా చూశారు రోహిత్, ధావన్. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలోనే 79 పరుగులు జోడించడంతో టీమ్ గెలుపు సులువైంది. నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


 రెండో వన్డేలో భారత్ విజయం

విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌ హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుంది. గత బుధవారం జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఈరోజు మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్య‌ (3/28)కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. గ్రాండ్ హోమ్ (50: 28 బంతుల్లో 1x4, 4x6), రాస్ టేలర్ (42: 36 బంతుల్లో 3x4) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఛేదనలో శిఖర్ ధావన్‌ (30: 31 బంతుల్లో 2x4)తో కలిసి తొలి వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి రోహిత్ శర్మ బాటలు వేయగా.. ఆ తర్వాత రిషబ్ పంత్ (40 నాటౌట్: 28 బంతుల్లో 4x4, 1x6), మహేంద్రసింగ్ ధోని (19 నాటౌట్: 17 బంతుల్లో 1x4) మరో 7 బంతులు మిగిలి ఉండగానే 162/3తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ బౌలర్లలో కృనాల్ పాండ్య‌ (3/28) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్ అహ్మద్ (2/27), భువనేశ్వర్ (1/29), హార్దిక్ పాండ్య (1/36) ఫర్వాలేదనిపించారు. కానీ.. 9.25 ఎకానమీతో 37 పరుగులిచ్చిన చాహల్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు కివీస్‌ కూడా టీమ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య‌, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్ తొలి టీ20‌లో హిట్టర్ టిమ్ సీఫర్ట్ (84: 43 బంతుల్లో 7x4, 6x6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన టీమిండియా 19.2 ఓవర్లలోనే 139 పరుగులకి ఆలౌటైంది. 

No comments:

Post a Comment