Breaking News

30/01/2019

గవర్నర్ ప్రసంగం తప్పుల తడక

గవర్నర్ ప్రసంగం తప్పుల తడక
విజయవాడ,  జనవరి 30, (way2newstv.in)
గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు అతి దూరంగా ఉంది. గవర్నర్ హృదయం బాధపడేలా ఉంది. ఎన్టీఆర్ పేరు ప్రస్తావన రాష్ట్ర ప్రభుత్వం చెబితే గవర్నర్ చెప్పడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అయన స్పందించారు. 
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గురించి ప్రస్తవాన గవర్నర్ తొలిగించి ఉంటే బాగుండెది. గవర్నర్ మాట్లాడిన 99 అంశాల్లో 74 అంశాల్లో కేంద్రం సహకరిస్తుంది అనేది గవర్నర్ ప్రసంగం ద్వారా తేటతెల్లమైంది.  24/7 కరెంటు లక్ష మెగా వాట్లు సోలార్ ద్వారా సేకరించలనే లక్ష్యంతో రాయలసీమ ప్రాంతంలో కేంద్రం సహకారంతో ఇస్తోంది. దానికి మిగులు కరెంటు ఉందని ప్రయివేటు కంపెనీల వద్ద రాష్ట్ర ప్రభుత్వం అత్యదిక రేట్లకు పవర్ కొంటోంది. కేంద్రం ద్వారా పంచాయితీ, విద్యా, హెల్త్ ఇలా అన్ని అంశాల్లో కేంద్రం అవార్డులు వస్తున్నాయని మీరే చెబుతున్నారు. కానీ కేంద్రం ఏమీ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం అబద్దమని తేలింది. 


 గవర్నర్ ప్రసంగం తప్పుల తడక

కాపులకు చంద్రబాబు ఏమి చేయలేదని తేలిపోయింది. కాపులకు రిజిస్ట్రేషన్లు కల్పించిన ఘనత మోడీది. కియో మోటర్స్ విషయంలో 2015లో మోడీ సౌత్ కొరియా ప్రటనలో హుండాయ్ ఫ్యాక్టరికీ అనుబంధంగా ఉన్న కియో మోటర్స్ ఏపీలో పెట్టాలని మోడీ సూచించారు. కేంద్రం ప్రాజెక్టుల్లో చంద్రబాబు హడావిడి తప్పా ఆయన చేసింది ఏముందని అయన ప్రశ్నించారు. 
పోలవరం విషయంలో మీకో సవాల్. పోలవరానికి మీకు ఏం సంబంధం ఉంది. 
పోలవరంతో మీతో చర్చకు రెడీ అని అయన అన్నారు.
మరో ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకని అన్నారు. కేంద్రం మోసం చేసింది, కుట్రలు చేసిందన్న మాటలు వాడడం బాధకరం. ఎమ్మెన్నార్ జిఎస్లో 20 వేల కోట్లు ఇచ్చింది. 2014 నుంచి 2018 వరకు లక్షా 58 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. పది శ్వేతపత్రాల గురించి వచ్చిన అంశాల్లో అన్నిఅబద్దాలే సీఎం చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. మేం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాం. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

No comments:

Post a Comment