Breaking News

10/08/2018

కేరళలో డ్యాములకు జలకళ

తిరువనంతపురం, ఆగస్టు 10, (way2ewstv.in)
భారీ వర్షాలతో కేరళలోని డ్యాములు జలకళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఇడుక్కి రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గరిష్ఠ నీటిమట్టానికి వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు. చివరిసారిగా 1992లో ఈ రిజర్వాయర్ గేట్లను తెరిచారు. 26 ఏళ్ల తర్వాత తెరుస్తుండటంతో మొదట ట్రయల్ రన్ నిర్వహించాలని భావించిన అధికారులు మొదట గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి గేటును తెరిచారు. 4 గంటల వ్యవధిలో మూడుగేట్లను తెరచి నీటిని విడుదల చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
 

కేరళలో డ్యాములకు జలకళ

ఇడుక్కి రిజర్వాయర్‌లో నీటిమట్టం గురువారం నాటికి 2,398.80 అడుగుల స్థాయికి చేరింది. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 2,403 అడుగులు. డ్యామ్‌లో నీటిమట్టం 2,397 అడుగులకు పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. ఇదమలయార్ డ్యామ్‌ నీటిమట్టం భారీగా పెరుగుతుండటంతో.. గురువారం (ఆగస్టు 9) డ్యామ్ నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఈ ఉదయం 5 గంటలకు 3 గేట్లను తెరచిన అధికారులు 8 గంటల ప్రాంతంలో మరో నాలుగో గేటును తెరచి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యామ్‌ గరిష్ఠ నీటి మట్టం 169 మీటర్లు. అయితే భారీ వర్షాలతో నీటిమట్టం 168.20 మీటర్లకు చేరింది. దీంతో బుధవారమే డ్యామ్ సమీప ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. గురువారం ఉదయం గేట్లను ఎత్తివేశారు. చివరిసారిగా 2013లొ డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. 5 సంవత్సరాల డ్యామ్ పూర్తిస్థాయిలో నిండు కోవడంతో డ్యామ్ గేట్లను ఎత్తివేశారు.. 

No comments:

Post a Comment