Breaking News

28/08/2018

ఒంగోలు నుంచి మాజీ డీజీపీ పోటీ

ఒంగోలు, ఆగస్టు 28, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివరావు.. 2019 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయబోతున్నారు. పార్టీ అంతర్గత వర్గాలనుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి.. ఈ విషయం దాదాపుగా ఖరారైనట్టే. కాపు వర్గానికి చెందిన మాజీ డీజీపీ సాంబశివరావు.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం అనేది.. కాపువర్గం నుంచి వెల్లడయ్యే స్పందనకు ప్రతీకగా వైసీపీకి శుభసంకేతం అని పలువురు భావిస్తున్నారు.కాపులకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ముసుగులేకుండా... ఉన్న విషయాన్ని బయటకు చెప్పేశారు. దీనిని వివాదంగా మార్చడానికి కొందరు ప్రయత్నించారు. కాపుల్లో జగన్ పట్ల అపరిమితమైన వ్యతిరేకత వస్తుందన్నట్లుగా ఒక ప్రచారం కూడా జరిగింది.



ఒంగోలు నుంచి మాజీ డీజీపీ పోటీ

 కానీ ఒకటిరెండు నిరసనలు తప్ప.. జగన్ ప్రకటన పట్ల కాపులు ఆగ్రహించడం అంటూ జరగలేదు. ప్రస్తుతం కాపు వర్గానికి చెందిన మాజీ డీజీపీ సాంబశివరావు చేరుతుండడం.. ఆ పార్టీకి అదనపు నైతికబలం అని చెప్పుకోవాలి.సాంబశివరావు ఒంగోలుకు చెందినవారు. అందుకే ఆయనను ఒంగోలు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దించుతారనేది సమాచారం. గత ఎన్నికల్లో అయితే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రస్తుత పరిస్థితులను గమనించినప్పుడు.. ఒంగోలు ఎమ్మెల్యేగా సాంబశివరావు పోటీచేయడం మాత్రం గ్యారంటీ. మరి బాలినేని ఎక్కడనుంచి కొత్తగా పోటీచేయిస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.బాలినేని ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయనకు ప్రత్యామ్నాయ నియోజకవర్గం చూస్తున్నారు. ఒకవేళ ఒంగోలు నుంచి కదలడానికి బాలినేని ససేమిరా ఒప్పుకోక పోయేట్లయితే గనుక... సాంబశివరావును ఒంగోలు ఎంపీగా బరిలోకి దించి, వైవీ సుబ్బారెడ్డిని అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి

No comments:

Post a Comment