Breaking News

24/08/2018

రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్

హైద్రాబాద్, ఆగస్టు 24, (way2newstv.in)
రాష్ట్రంలో రేషన్ దుకాణాల డీలర్ల సమస్యలపై తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఇవాళ ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. అనంతరం ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గతంలో డీలర్లకు కిలో బియ్యంపై ఇస్తున్న కమిషన్ 20 నుంచి 70 పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 2015, అక్టోబర్ 1 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటికే రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేశామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో బియ్యం పంపిణీలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర రేషన్ దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసిం.



 రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్

No comments:

Post a Comment