Breaking News

20/08/2018

కేంద్ర ప్రాయోజిత పథకాలఫై మంత్ర హరీశ్ రావు సమీక్ష

 హైదరాబాద్ ఆగష్టు 20  (way2newstv.in)
సాగు నీటి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలయిన ఏఐబీపి, డ్రిప్  భూగర్భజలాలు, ఆర్.ఆర్. ఆర్.  పథకాలపై  మంత్ర హరీశ్ రావు సమీక్ష జరిపారు. జల సౌధలో జరిగిన ఈ సమీక్షలో ఛైర్మన్ ప్రకాష్, ఈఎన్సీ మురళీధర్, కాడా కమిషనర్ మల్సూర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే,  భూగర్భ జల శాఖ డైరెక్టర్ పండిట్, మైనర్ ఇరిగేషన్ సీఈ శ్యాం సుందర్,  డైరెక్టర్ జనరల్ వాలంతరి శ్యాం సుందర్, సీఈ హైడ్రాలజీ శంకర్ నాయక్, సీఈ సీవోడీ తరపున ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై ఒక్కొక్కటిగా మంత్రి సమీక్ష నిర్వహించారు.  ట్రిపుల్ ఆర్ పనుల నిమిత్తం కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఆరా తీశారు. ఇప్పటి వరకు పనులు పూర్తయిన వాటికి యుటిలైజేషన్ పత్రాలు కేంద్రానికి సమర్పించి రావాల్సిన నిధులు పొందాలని సూచించారు.  ఇక డామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం( డ్రిప్) కింద. వరల్డ్ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 33 ప్రాజెక్టు డామ్ ల ఆధునీకరణ, మరమ్మతుల కోసం 665 కోట్ల రూపాయల ప్రతిపాదలను పంపారు. 



కేంద్ర ప్రాయోజిత పథకాలఫై మంత్ర హరీశ్ రావు సమీక్ష

 వీటిని సెప్టెంబర్ 15 లో వరల్డ్ బ్యాంకు కు పంపి కేంద్రం నుంచి అనుమతులు తీసుకునే అవకాశం ఉందని అధికారులు మంత్రికి తెలుసుకున్నారు. వీటి పురోగతిని మంత్రి హరీశ్ రావు అడిగి తెలుసుకున్నరు. భూగర్భ జల  అధికారుల నుంచి ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపధ్యంలో భూగర్భ జలాలు  ఎంత పెరిగాయన్న వివరాలు అడిగి తెలుసుకున్నరు. కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద 70 కోట్ల నిధులతో గ్రౌండ్ డేటా సిస్టంను బలోపేతం చేయడం, భూగర్భ జలాల సమాచారాన్ని మాన్యువల్ గా కాకుండా, డిజిటల్ పద్ధతిలో సేకరించడం, ఇందు కోసం యంత్రాలు వినియోగించడం, భూగర్భజల శాఖ కార్యకలాపాలు, ప్రణాళికను మరింత ఆధునీకరించడం, వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈఏడాది 16 కోట్లతో కొన్ని పనులు చేపడుతున్నట్లు భూగర్భ జల శాఖ అధికారులు మంత్రికి తెలిపారు.  ఈ పనులు ప్రణాళికబద్దంగా పూర్తి చేసి కేంద్రం మరింత నిధులు విడుదల చేసేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. భూగర్భజలాల సమాచారణ సేకరణకు 800 కొత్త పీజో మీటర్లు, 900 వాటర్ లెవల్ రికార్డర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్సెంటివైజేషన్ స్కీం ఫర్ బ్రిడ్జింగ్ ఇరిగేష్ గ్యాప్  కింద కేంద్రం 1784 కోట్లు ఇస్తామని కేంద్రం అంగీకరించినట్లు వాలంతరీ అధికారులు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్వో తయారు చేసి  పంపామని,,ఈ పథకం కింద ..కేంద్రం, రాష్ట్రం నిధులు వెచ్చించాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. అయితే 690 కోట్లకు  రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడానికి  ఇప్పటికే పరిపాలన పరమైన అనుమతులు  ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇందులో 50 కోట్ల నిధులతో రీజనల్ ట్రైనింగ్ సెంటర్లు మూడింటిని సిద్దిపేట, పాలెం, వరంగల్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐదు కోట్లతో వాలంతరీని ఆధునీకరిస్తామన్నారు.  సెంట్రల్ వాటర్  కమిషన్  వాటర్ యూజ్ ఎఫీషియంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా రెండేళ్ల క్రితం  వాలంతరీకి బాధ్యతలు అప్పగించిందని వాలంతరీ అధికారులు తెలిపారు. ఒక్కో ప్రాజెక్టు నీటి వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రాజెక్టును ఇచ్చారని మంత్రికి వివరించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పది ప్రాజెక్టులు  అప్పగించగా అందులో  70 శాతం పనులు పూర్తయ్యాయి. 30 శాతం మాత్రమే నిధులు ఇచ్చారని తెలిపారు. మిగతా  నిధులు రావాల్సి ఉందన్నారు. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో సంప్రదించి నిధులు పొందాలని మంత్రి సూచించారు.

No comments:

Post a Comment