Breaking News

17/07/2018

జన వాసాల్లో గ్యాస్ గౌడన్లు

వరంగల్, జూలై 17 (way2newstv.in)   
వరంగల్ నగరంలోని హన్మకొండ శ్రీనివాసకాల నీ, వరంగల్‌లోని ఎల్‌బీనగర్‌లో గ్యాస్‌ గోదాంలు ఉన్నాయి. జనావాల మధ్య ఉండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పట్టణంలోని గొర్రెకుంట శివారులోని ఫైర్‌ వర్క్స్‌ గోదాంలో భారీ ప్రమాదంలో ఎనిమిదిమంది  మృతి చెందారు. దీంతో గ్యాస్‌ గోదాంల పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వణికిపోతున్నారు.అయితే హన్మకొండలోని శ్రీనివాస కాలనీతో పాటు వరంగల్‌ ఎల్‌బీనగర్‌లలో గ్యాస్‌ గోదాంలు దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. నగర విస్తరణలో భాగంగా గోదాంల చుట్టు కాలనీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత గ్యాస్‌గోదాంలను అక్కడి నుంచి తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గ్యాస్‌ డీలర్లు ఇచ్చే నజరానాలతోనే నిబంధనలను పట్టించుకోకుండా ఎన్‌ఓసీలు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా రెవెన్యూ, పౌరసరఫరాలు, అగ్నిమాపక, పోలీసు శాఖలకు చెందిన అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈగోదాముల్లో ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి.గ్యాస్‌గోదాంలు జనావాసాల మధ్య నిర్వహిస్తున్నారని, వీటికి ఎన్‌ఓసీలు ఎలా జారీ చేశారని అగ్నిమాపక శాఖ అధికారులను ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదన్న సమాధానం వస్తోంది.  కాగా ఈగోదాంలను తరలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. 



జన వాసాల్లో గ్యాస్ గౌడన్లు

No comments:

Post a Comment