Breaking News

18/07/2018

హాట్ టీజర్ తో మోహిని

హైద్రాబాద్, జూలై 18 (way2newstv.in)
ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ‘మోహిని’. రెండేళ్ల కిందటే ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. అయితే ఏమైందో కానీ తెరమరుగు అయ్యింది. ఇప్పుడు టీజర్‌తో ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇది వరకూ త్రిష ఒక హారర్ సినిమాలో నటించింది. దానికి తన గ్లామర్ తలుకులు అద్దింది. ఇప్పుడు ‘మోహిని’ అంటూ వస్తోంది ఈ భామ. దీనికి కూడా త్రిష అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే త్రిషకు 35 యేళ్లు వచ్చేశాయి. యువ హీరోల సినిమాల్లో త్రిషకు అవకాశాలేవిప్పుడు. ఎవరైనా ముదురు హీరోలు అవకాశాలు ఇస్తేనే త్రిష సినిమాలు చేయగలుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో సోలోగా కూడా ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి ప్రయత్నమే ‘మోహిని’. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే.. త్రిష ప్రధాన పాత్రలో సినిమాలు తీయాలనుకునే వారికి ఉత్సాహం లభించగలదు. ‘మోహిని’ సినిమాకు ప్రచారం కల్పించేందుకు అందులో త్రిష స్టిల్స్ ను వెబ్‌లోకి వదిలారు దీని రూపకర్తలు. మరి త్రిష ఏ మేరకు ప్రేక్షకులను థియేటర్లను ఆకర్షించగలదో చూడాలి! 



హాట్ టీజర్ తో మోహిని

No comments:

Post a Comment