Breaking News

17/07/2018

"నన్నుదోచుకుందువ‌టే" సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌

 (way2newstv.in)
సమ్మోహనం తో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసుకున్న సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్రం మెద‌టి లుక్ టీజ‌ర్ ని 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు.. ఈ టీజ‌ర్ లోనే దాదాపుగా సినిమా కాన్సెప్ట్ ని చెప్పారు. ఆఫీస్ మెత్తం బ‌య‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెని మేనేజ‌ర్ గా సుదీర్‌బాబు న‌టించ‌గా.. బాగా అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది.  రొమాంటిక్ కామెడి చిత్రంగా రెడి అవుతున్న ఈ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌చ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుండి ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి.



"నన్నుదోచుకుందువ‌టే" సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రోడ‌క్ష‌న్స్ లో నిర్మిస్తున్న నన్నుదోచుకుందువ‌టే చిత్రానికి సంబందించిన టీజ‌ర్ ని జులై 14న రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ కి అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. మా చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. సెప్టెంబర్ 12 నే ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అలాగే మా విడుద‌ల డేట్ ని దృష్టిలో వుంచుకుని త్వ‌ర‌లో ప్ర‌మెష‌న్ ని ప్లాన్ చేస్తున్నాము. ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌గా వారి మ‌న‌సు దోచుకోవాల‌నే ఉద్దేశంతోనే వారికి ద‌గ్గ‌ర‌గా ఈ చిత్ర ప్ర‌మెష‌న్ ని ప్లాన్ చేశాము. స‌మ్మెహ‌నం లాంటి మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత సుధీర్‌బాబు గారు నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌టం ప్రేక్ష‌కుల అంచ‌నాలు భారీగా వుంటాయి. అందుకు ఈ చిత్ర ప్ర‌మెష‌న్ లో తెలుగు ప్రేక్ష‌కులంద‌రినీ ఇన్‌వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ప్రోడ‌క్ష‌న్ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. ఈ క‌థ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.  అని అన్నారు.
నటీనటులు సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు

No comments:

Post a Comment