హైద్రాబాద్, జూలై 18 (way2newstv.in)
ఎన్నికల మేనిఫెస్టో.. ఎలక్షన్ల టైమ్ లో ఇదొక ఆనవాయితీ. ఇచ్చిన హామీలు నెరవేర్చినా, నెరవేర్చకపోయినా తామేం చేస్తామనే విషయాన్ని ఓ పుస్తక రూపంలో రాజకీయ పార్టీలన్నీ ఇలా విడుదల చేస్తుంటాయి. రాష్టాన్ని ఉద్ధరించేస్తాం, పేదల బతుకులు మార్చేస్తాం, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తాం అంటూ రకరకాల హామీలుంటాయి ఈ పుస్తకంలో. వీటిలో కొన్ని ఆచరణ సాధ్యంకానివి కూడా ఉంటాయి. చదువుతుంటే భలే నవ్వొస్తుంది కూడా.ఇప్పుడీ ఆనవాయితీని పవన్ కల్యాణ్ కొద్దిగా మారుస్తున్నారు. జనసేన పార్టీ తరఫున ఇతను కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఒక్కపుస్తకం కాదు, 175 పుస్తకాల రూపంలో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు పవన్.అవును... నియోజక వర్గానికో మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ.
వినూత్పంగా జనసేన మ్యానిఫెస్టోలు
దీనికి వాళ్లిచ్చుకునే వివరణ కూడా వెరైటీగా ఉంది. ఊరూరా ఎవరి సమస్యలు వాళ్లకున్నాయి. అలాంటిది రాష్ట్రం మొత్తానికి ఒకే మేనిఫెస్టో ఇస్తే ఎలా? అందుకే నియోజక వర్గానికో మేనిఫెస్టో ఇస్తున్నామంటూ ప్రకటించుకున్నారు.ఇప్పటికే పవన్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు షురూ చేశారు. దీనికి ఆయన పోరాట యాత్ర అనే పేరు కూడా పెట్టారు. అలా తిరుగుతూ తను అర్థం చేసుకున్న ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తారట. వీటిలో కొన్ని నియోజకవర్గాలకు చెందిన మేనిఫెస్టోల్ని వచ్చే నెలలోనే రిలీజ్ చేయబోతున్నారు. అలా దశలవారీగా రాబోయే నెలల్లో నియోజక వర్గాల వారీగా మేనిఫెస్టోలు విడుదలవుతాయన్నమాట. ఆలోచనైతే బాగానే ఉంది కానీ, ఆచరణలో ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది చూడాలి. ఎందుకంటే మేనిఫెస్టో అనేది పార్టీల దృష్టిలో కేవలం ఓ పుస్తకం. దాన్ని అమలు చేయాలని ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అనుకోలేదు. పవన్ కూడా అలానే పుస్తకాలు ప్రింట్ చేసి గాలికి వదిలేస్తారని మిగతా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.జనసేన పార్టీ మాత్రం ఈ విమర్శల్ని సోషల్ మీడియాలో గట్టిగా తిప్పికొడుతోంది. జనసేనతోనే మార్పు సాధ్యం అవుతుందని వాదిస్తోంది.
No comments:
Post a Comment