ముంబై, జూలై 24 జూలై 25, (way2newstv.in)
ఇంగ్లాండ్‌లో షెపర్డ్ నీమే కెంట్ క్రికెట్ లీగ్ కొత్త చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని సరికొత్త రికార్డు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీలో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఓ జట్టు కేవలం 12 నిమిషాల్లోనే ఛేదించగా.. దీంతో మ్యాచ్ కేవలం 61 నిమిషాల్లోనే ముగిసిపోయింది. 152ఏళ్ల ఇంగ్లాండ్ క్లబ్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదైంది. లీగ్‌లో భాగంగా బెకన్హమ్, బెక్స్‌లీ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెకన్హమ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కేవలం 18 పరుగులకు ఆలౌటైంది. 42 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన ఆజట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఏ ఒక్క ఆటగాడు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్ తలో నాలుగు పరుగులు మాత్రమే చేశారు. ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. కాలమ్ మాక్‌లీడ్ ఆరు ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీయగా.. జాసన్ బెన్ 5.2 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెక్స్‌లీ జట్టు 3.3 ఓవర్లలో అలవోకగా టార్గెట్‌ను ఛేదించింది. క్రిష్టోఫర్ లాస్(4), ఎయిడెన్ గిగ్స్(12) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి చరిత్రాత్మక విజయాన్ని అందించారు.
క్రికెట్ చరిత్రలో రికార్డ్...18 పరుగులకే ఆలౌట్
ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, దర్శకుడు ఎన్. శంకర్, కేథరిన్ హడ్డా, ఇజ్రాయెల్ అంబాసిడర్ డేనియల్ కార్‌మాన్, నటుడు మహేశ్ బాబు, బ్రహ్మజీ, ప్రియదర్శితో పాటు పలువురు ఉన్నారు.
No comments:
Post a Comment