ముంబై, జూలై 25, (way2newstv.in)
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన ‘ధడక్’ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరాఠీ సినిమా ‘సైరత్’కి రీమేక్‌గా వచ్చినప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. ముఖ్యంగా.. జాన్వీ కపూర్ తన అందం, అభినయంతో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తొలి చిత్రమే అయినప్పటికీ ఇషాన్ ఖట్టర్ కూడా చక్కగా నటించాడు. తెరపై ఈ జంట రొమాన్స్ పండటంతో.. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ. 33.67 కోట్లు కొల్లగొట్టింది. మరాఠీలో సంచలన కలెక్షన్స్‌తో దుమ్ముదులిపిన ‘సైరత్’ సినిమా ఇప్పటికే కొన్ని భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలిసి కథే కావడంతో.. ‘ధడక్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో..? అని మూవీ మేకర్స్‌లో ఆసక్తి నెలకొంది. కానీ.. మూల కథలో మార్పులు చేయకుండా జాగ్రత్తపడిన దర్శకుడు శశాంక్.. చిన్న చిన్న మార్పులతో అభిమానుల్ని మెప్పించాడు. సైరత్ సినిమా సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. దాదాపు వంద కోట్లపైనే కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. తాజాగా ధడక్ కూడా.. తొలి మూడు రోజుల్లో వరుసగా రూ. 8.71 కోట్లు, రూ.11.04 కోట్లు, రూ. 13.92 కోట్లు కలెక్షన్స్‌ని రాబట్టింది.
కలెక్షన్లతో దూసుకుపోతున్నధడక్
No comments:
Post a Comment