Breaking News

11/01/2020

రాహువు, కేతువులకు ఒకేసారి పూజ చేయిస్తే కుజదోషం పోతుందా?

(way2newstv.in)
కుజదోషం – (మంగళిక దోషం) అంటే ఏమిటి? వివాహం కొరకు రహువు, కేతువులకు ఒకేసరి పూజ చేయిస్తే కుజదోషం పోతుందా? నేడు హింధూ సమాజం లో ప్రతి ఒక్కరిలో ఉదయెంచే ప్రశ్న ?
మనవునికి రావల్సిన అదృష్టాన్ని అడ్డగింజడంలో కాలసర్పదోషం పోషించే పాత్ర ఇంతా అంతా కాదని చెప్పవచ్చును. కాలసర్పదోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడ్డలతో , స్థాయితో సంబంధం లేదు. మహారాజైనా , బిక్షకుడు అయినా కాలసర్ప దోషానికి గురికాక తప్పదు.
కుజదోషము ఉంది అనగానే అనేక పూజ చేయించండి. అప్పుడు వారికి తప్పక వివాహం జరుగును అంటారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే రాహువు వ్యయకారకుడు అనగా…
(1) రాహువు గ్రహము:- ఒక వ్యక్తి జాతకంలో ఈ గ్రహము బలంగా వుంటే ఆ వ్యక్తి స్థలములు కొనుట, గృహములు నిర్మించుట వంటివి చేస్తాడు. ఇంకా విద్య కొరకు , వివాహం కొరకు మరియు ఉద్యోగం కోసం వ్యయం చేస్తాడు.
అదే రహువు నీచ (-) స్థితిలో వుంటే ఆరోగ్యం చెడిపోవుట దాని వలన ఆసుపత్రులకు అనగా వైద్యం కొరకు, వ్యసనాలకు, దొంగతనుము, ధనము పోగొట్టుకొనుట ఇంకా మోసములకు గురి అవుతారు.
రాహువు, కేతువులకు ఒకేసారి పూజ చేయిస్తే కుజదోషం పోతుందా?

అందువలన రాహువుకు శాంతి జరుపుటకు వివహమునకు సంబంధం లేదు.
(2) కేతువు గ్రహము:- కేతువు మృత్యు కారకుడు. కావున కేతువు బలంగా వుంటే ఆ వ్యక్తి మృత్యువును జయించే శక్తిని కలిగి వుంటాడు. అలాగే కేతువు అనుగ్రహం ఉన్న కొంతమందికి మానవతీత శక్తులు, తాంత్రిక శక్తులు, వైద్యం, జ్యోతిష్య శాస్త్రం, జౌషద తయారీ మొదలగు వాటిల్లో ప్రాముఖ్యత కలిగి వుంటారు.
అదే కేతువు నీచ (-) స్థితిలో వుంటే ఆరోగ్యము చెడిపోవును. అంతేకాక ఆ వ్యక్తికి వచ్చిన వ్యాది డాక్టర్లు కూడ తెలియన్విదు. దానివలన డాక్టరు గారు ఇచ్చిన మందులు ఆ వ్యక్తికి సైడ్ ఎఫెక్టులు అయి అతనికి అతి భయం ఏర్పడి ఎందుకీ జీవితం అనే స్థితికి చేరవచ్చును. అందుకే కేతువు మృత్యుకారకుడు అంటారు.
అందుకే వారములు 7 అని చెప్పిరి. కాని గ్రహములు 9 అని చెప్పిరి.
(1) రవి – (ఆదివారం) 2) చంద్రుడు – (సోమవారం) 3) కుజుడు – (మంగళవారం) 4) బుధుడు – (బుధవారం) 5) గురువు – (గురువారం) 6) శుక్రుడు – (శుక్రవారం) 7) శని – (శనివారం). రాహువు, కేతువులకు వారములు లేవు కారణం అవి ఛాయా గ్రహాలు. అంతేగాదు వాటి ప్రభావములు కనుగొనుట చాలా కష్టం. అందుకే వారమలు కూడా మన 7 7 గ్రహాలు అనుగుణంగా మ సాస్త్రములు అనుసరించే వారలకు పేర్లు పెట్టిరి.
అంతే కాకుండ వాటి నుండి తప్పించు కొనుటకు వీలు లేకుండా ప్రతి రోజు రాహువుకి రహుకాలము అని.
కేతువుకి యమ గండం అని అనగా కేతువు మృత్యుకారకుడు. కావున రాహువు, కేతువులు గతజన్మ కర్మ ఫలాలను అనురించి వాటి ఫలితాలు జరుపుకుంటాయి.
కావున చాలామంది జ్యోతిష్య పండితులు కుజదోషం (మంగళిక దోషం) కొరకు రాహువు, కేతువులకు శాంతి చేయించుట వలన కుజదోషము ఏవిధముగ పరిహారము అవుతుంది ? అదియునుగాక రాహువు, కేతువులు ఒకదానికి ఒకటి ఎదురు ఎదురుగా వుంటాయి. రాహువు నార్త్ కోడ్ , కేతువు సౌత్ కోడ్.
కావున వివహానమునకు (మగళక దోషము) కొరకు రాహువు, కేతువులకు శాంతి చేయుట వలన వివాహ దోషము ఏ విధమున పరిహారము అవుతుంది?
పూజ్యులు ప్రముఖ రచయతలు శ్రీ శ్రీదరన్ కాండూరి గారు రచించిన సర్ప గ్రహాలు అనే పుస్తకములో చాలా చక్కగా ఈ క్రింది విధముగా సర్ప గ్రహాల దోషములు అనగా రాహువు, కేతువులు ఉన్న స్థానములకు బట్టి 12 రకములగ వివరించిరి. అవి….
1) అనంత కాలసర్పదోషం :- రహువు 1వ స్థానం కేతువు 7వ స్థానం
2) కులిక కాలసర్పదోషం :-   రహువు 2వ స్థానం కేతువు 8వ స్థానం
3) వాసుకి కాలసర్పదోషం :- రహువు 3వ స్థానం కేతువు 9వ స్థానం
4) శంకపాల కాలసర్పదోషం :- రహువు 4వ స్థానం కేతువు 10వ స్థానం
5) పద్మ కాలసర్పదోషం :- రహువు 5వ స్థానం కేతువు 11వ స్థానం
6) మహాపద్మ కాలసర్పదోషం :- రహువు 6వ స్థానం కేతువు 12వ స్థానం
7) తక్షక కాలసర్పదోషం :- రహువు 7వ స్థానం కేతువు 1వ స్థానం
8) కర్కోటక కాలసర్పదోషం:- రహువు 8వ స్థానం కేతువు 2వ స్థానం
9) శంఖచూడ కాలసర్పదోషం:- రహువు 9వ స్థానం కేతువు 3వ స్థానం
10)పాతక కాలసర్పదోషం:- రహువు 10వ స్థానం కేతువు 4వ స్థానం
11) విషధార్ కాలసర్పదోషం :- రహువు 11వ స్థానం కేతువు 5వ స్థానం
12)శేషనాగ కాలసర్పదోషం:- రహువు 12వ స్థానం కేతువు 6వ స్థానం
ఒక అనుభవజ్ఞాడైన జ్యోతిష్య పండితుడు మాత్రమే వ్యక్తుల యొక్క జాతక చక్రాలను నిశితంగా పరిశిలించి ఆ జాతకాలు ఉన్న కాలసర్పదోషానికి ఏ విధమైన పరిహారం చెయ్యాలో నిర్ణయించగలరు.
కావున రాహువు, కేతువులకు శాంతి జరుపుట వలన కుజదోషం (మంగళిక దోషం) నికి సంబంధం లేదు. కావున వివాహానికి రాహువు, కేతువులకు సంబంధం లేదని నా అభిప్రాయం.
కాలసర్వదోషలు
1. అనంత కాలసర్పదోషం : ఒక వ్యక్తి జాతక చక్రంలోని లగ్నంలో రాహువు, సప్తమస్థానంలో కేతువు ఉండి మిగిలిన గ్రహాలు ఈ రెండు ఛాయా గ్రహాల మధ్యలో చిక్కుకుని ఉన్నట్లయితే ఆ పరిస్థితిని అనంతకాలసర్పదోషం అంటారు. ఈ కాలసర్పదోషంతో బాధపడేవారు తరచుగా అవమానాలు పొందటం. ఆందోళనలకు గురికావటం జరుగుతుంది వీరిలో స్యూనతాభవం అధికంగా ఉంటుంది ఒక ముఖ్యమైన విషయం ఏమంటే అనంత కాలసర్పదోషం ఉన్నవారు నీటినిచూసి విపరీతంగా భయపడతారు. వీరు లోతైన బావులను, నదులను , గుంటలను చూసి తాము అందులో పడిపోతామేమో అని అకారణంగా భయపడతారు. ఇది అనంతకాలసర్పదోషం యొక్క ప్రత్యేకత అని గ్రహించాలి.
2. కులిక కాలసర్పదోషం: ఒక వ్యక్తి జాతక చక్రంలోని రెండవ స్థానంలో రాహువు, ఎనిమిదవ స్థానంలో కేతువు ఉండి మధ్యవున్న స్థానాలలో ఇతర ఏడు గ్రహాలు ఉన్నట్లయితే అట్టి పరిస్థితిని కులిక కాలసర్పదోషం అని పిలుస్తారు. ఈ విధమైన గ్రహస్థితులు ఉన్న జాతకులు ధనాన్ని నష్టపోవటంవల్ల, ప్రమాదాలవల్ల నష్టపోవటం జరుగుతుంది. వీరికి మాట్లాడటంలో శారీరకమైన సమస్యలు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా కుటుంబంలో తగాదాలు, నరాల బలహీనత, మూర్ఛలు లాంటి సమస్యలు కూడా వీరికి ఎదురవుతాయి.
3. వాసుకి కాలసర్పదోషం: ఒక మానవుడి జన్మకుండలినిలోని మూడువస్థానంలో రాహువు, తొమ్మితవ స్థానంలో కేతువు ఉండి ఆ రెండింటి మధ్య ఉన్న స్థానాలలో ఇతర ఏడు గ్రహాలు చిక్కుకుని ఉన్నట్లయితే ఆ పరిస్థితిని వాసుకి కాలసర్పదోషం అని పిలుస్తారు. ఈ విధమైన సర్పదోషంతో బాధపడేవారు సోదరుల కారణంగా లేదా అక్కా చెల్లెళ్ళవల్ల నష్టపోవటం జరుగుతుంది. వీరు బంధువులవల్ల కలిగే చిక్కువల్లకాని, రక్తసంబంధమైన సమస్యల వల్లకాని ఆకస్మిక మృతిపొందే అవకాశం ఉంటుంది.
4. శంఖపాల కాలసర్పదోషం: ఒక వ్యక్తి జాతక చక్రంలోని నాల్గవ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కేతువు ఉండి వాటి మధ్యలో ఇతర గ్రహాలు చిక్కుకుని ఉన్నట్లయితే ఆ జాతకునికి 5 శంఖపాల కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ విధమైన సర్పదోషంతో జన్నించిన వ్యక్తులకు తండ్రి నుండి ప్రేమ లభించధు. వీరు అతి శ్రమలను చేస్తూ జీవించటం జరుగుతుంది. వీరు తరచుగా వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. వీరు తమ జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలలోను లేదా విదేశాలలోను అతి హీనమైన పరిస్థితులలో మరణించటం జరుగుతుంది.
5. పద్మ కాలసర్పదోషం: ఒక వ్యక్తి జన్మకుండలినిలోని 5వ స్థానంలో రాహువు, 11వ స్థానంలో కేతువు ఉండి ఆ రెండు సర్పగ్రహాలమధ్య ఇతర గ్రహాలు స్థితిపొంది ఉన్నట్లయితే ఆ జాతకుడికి పద్మకాలసర్పయోగం ఏర్పడుతుంది. ఈ విధమైన సర్పదోషం ఉన్నవారు చదువులో వెనుకపడటం జరుగుతుంది. ఈ జాతకుల యొక్క బార్యలను తరచుగా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఈ జాతకులు సంతాన భాగ్యాన్ని పొందలేకపోవటం మరియు స్నేహితుల వలన వంచింపబడటం జరుగుతుంది.
6. మహాపద్మ కాలసర్పదోషం: ఒక జాతకుడి జన్మచక్రంలోని 6వ స్థానంలో రాహువు మరియు 12వ స్థానంలో కేతువు ఉండి ఈ రెండు గ్రహాలమధ్య ఇతర గ్రహాలు చిక్కుకుని ఉన్నట్లయితే ఆ జాతకుడి మహాపద్మకాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ కాలసర్పదోషాన్ని కలిగి ఉన్న వ్యక్తులు వెన్నెముక ప్రారంభ భాగంలో నెప్పులను మరియు తలనొప్పులను మరియు చర్మవ్యాధులను కలిగి వుంటారు. అంతేకాకుండా వీరికి తరచుగా ఆస్తుల నష్టం కలుగుతుంది. అతి మఖ్యమైన విషయం ఏమంటే మహాపద్మకాలనర్పదోషంతో బాధపడేవారికి దయ్యాల పట్టటం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరిమీద చేతబడులు జరిగే అవకాశం కూడా ఉంటుంది.
7. తక్షక కాలసర్పదోషం: ఒక వ్యక్తి జాతక చక్రంలోని 7వ స్థానంలో రాహువు, లగ్నంలో కేతువు ఉన్నట్లయితే ఆ వ్యక్తి తక్షక కాలసర్పదోషంతో బాదపడతాడు. ఈ విధమైన సర్పదోషం ఉన్నవారు, నీచంగా ప్రవర్తించేవారిచేత అనేక రకాల బాధలు పొందవలసి వస్తుంది. వీరు వ్యాపారంలో నష్టపోవటం అసంతృప్తితో బాధపడటం, వైవాహిత సుఖాన్ని పొందలేకపోవటం జరుగుతుంది. వీరికి వృత్తిపరమైన సమస్యలు ఉంటాయి. ప్రమాదాలు జరుగుతాయి. తరచుగా ఆందోలనలు ఏర్పడతాయి.
8. కర్కోటక కాలసర్పదోషం: ఒక వ్యక్తి జాతక చక్రంలోని 8వ స్థానంలో రాహువు , 2వ స్థానంలో కేతువు ఉండి ఆ రెండు సర్పగ్రహాల మధ్య ఇతర గ్రహాలు ఉన్నట్లయితే ఆ జాతకుడు కర్కోటక కాలసర్పదోషాన్ని పొందుతాడు. ఈ విధమైన సర్పదోషం ఉన్నవారు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను కోల్పోతారు. వీరికి శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు రావటం జరుగుతుంది. వీరు విషపూరితమైన సర్పాలవల్ల మరియు కిటికాలవల్ల ప్రమాదాలు పొందుతారు. వీరికి కుటుంబంలో అనేక సమస్యలు ఎదురువుతాయి. కర్కోటక కాలసర్పదోషం ఉన్న వ్యక్తులకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.
9. శంఖచూడ కాలసర్పదోషం: ఒక జాతకుని జన్మకుండలినిలోని 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు ఉండి ఆ రెండు గ్రహాల మద్య ఇతర గ్రహాలు చిక్కుకుని ఉన్నట్లయితే ఆ జాతకునికి శంఖచూడ కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ విధమైన కాలసర్పదోషంతో బాధపడేవారు తమ మతానికి ద్రోహం చేసి మత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారు. వీరు క్రూరమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. వీరికి హై బి.పి. మరియు నిరంతర ఆందోళనలు ఉంటాయి.
10. పాతక కాలసర్పదోషం: ఒక మానవుని జన్మకుండలినిలోని 10వ స్థానంలో రాహువు , 4వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకునికి పాతక కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ విధమైన సర్పదోషంతో జన్మించిన వ్యక్తులు కుటిల స్వభావాన్ని కలిగి ఉండి ఇతరులకు ద్రోహం చేస్తూ ఉంటారు. ఈ దోషం ఉన్న వ్యక్తుల గృహాలలో దొంగతనాలు జరుగుతాయి. ఈ దోషం ఉన్న వ్యక్తులకు పిశాచాల వలన ప్రమాదం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ కాలసర్పతోషంతో బాధపడేవారికి లో బి.పి. సమస్య తీవ్రంగా ఉంటుంది.
11. విషధార్ కాలసర్పదోషం: ఒక వ్యక్తి జన్మ చక్రంలోని 11వ స్థానంలో రాహువు , 5వ స్థానంలో కేతువు ఉండి మిగిలిన గ్రహాలు ఈ రెండు సర్పగ్రహాల మధ్య చిక్కుకుని ఉన్నట్లయితే ఆ వ్యక్తికి విషధారి కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ విధమైన కాలసర్పదోషంతో బాధపడేవారు చపలమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. ఈ దోషంతో జన్మించినవారు సంతానపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. వీరు కారాగార శిక్షనుకూడా అనుభవించే అవకాశం ఉంటుంది. వీరికి సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
12. శేషనాగ కాలసర్పదోషం: ఒక వ్యక్తి జన్మకుండలినిలోని 12వ స్థానంలో రాహువు మరియు 6వ స్థానంలో కేతువు ఉండి ఆ రెండు గ్రహాల మధ్య ఇతర ఏడు గ్రహాలు చిక్కుకుని ఉన్నట్లయితే ఆ జాతకునికి శేషనాగ కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ విధమైన కాలసర్పదోషం ఉన్నవారు తరచుగా ఓటమికి గురి అవుతూ ఉంటారు. వీరిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. వీరిని రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు. వీరు నేత్ర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

No comments:

Post a Comment